తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక మార్పులు తీసుకొస్తుంది. మొన్నటి వరకు విద్యుత్ బిల్లులను మనీ ట్రాన్స్ ఫర్ యాప్ లైన పేటీఎం, ఫోన్ ఫే, గూగుల్ పే ద్వారా చెల్లించారు. అయితే అనూహ్యంగా తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) ఆన్ వీటి ద్వారా చెల్లించడం కుదరని తేల్చి చెప్పింది. జూలై 1 నుంచి విద్యుత్ బిల్లులను TGSPDCL కు చెందిన వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చెల్లించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లో విద్యుత్ బిల్లులు చెల్లించేవారిలో కొంత ఆందోళన నెలకొంది. అయితే TGSPDCL శుభవార్త తెలిపింది.
విద్యుత్ బిల్లులు చెల్లించాలంటే TGSPDCL వెబ్ సైట్ లోకి లేదా యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం ఇబ్బందిగా మారనుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో వినియోగదారుల సౌలభ్యం కోసం QR కోడ్ ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. ఇక పై ఇంటికి వచ్చే విద్యుత్ బిల్లులపై QR కోడ్ ను ముద్రించనున్నారు. దీనిని స్కాన్ చేయగానే నేరుగా బిల్లు ఆప్షన్ లోకి వెళ్తారు. అప్పుడు ఈజీగా బిల్లులు చెల్లించుకోవచ్చని తెలిపారు.
దీనిని ఫైలెట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఇది సక్సెస్ అయితే అన్ని ప్రాంతాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. గతంలో విద్యుత్ బిల్లులను కొందరు విద్యుత్ ఆఫీసులకు, మీ సేవ కేంద్రాలకు వెళ్లి చెల్లించేవారు. ఆ తరువాత మనీ యాప్ ట్రాన్స్ ఫర్ ద్వారా చెల్లించారు. ఇప్పుడు చివరికి QR కోడ్ ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పించారు.





