Friday, January 30, 2026

కొత్త వాహనం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. ఇక షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్..

తెలంగాణ రవాణా శాఖలో కీలక సంస్కరణలు చేయనున్నారు. ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా వాహనం కొనుగోలు చేయాల్సి వస్తే.. దాని రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. దీనిపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఈ విధానం అమలు కానుంది. ఇది అమలులోకి వస్తే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభం కానుంది. కొత్తగా బైక్ లేదా కారు కొనుగోలు చేయాల్సి వస్తే ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రైవేట్, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు కూడా ఇది వర్తించనుంది.

ఇప్పటివరకు ఏదైనా షో రూమ్ లో వాన కొనుగోలు చేయాల్సివస్తే షో రూమ్ లో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేవారు. కానీ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత నెంబర్ ప్లేట్ కోసం డీలర్ వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇలా బైకు లేదా కారు కోసం చాలా సార్లు కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి రావడంతో సమయం వృధా అయ్యేది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది.

కొత్త విధానం అమల్లోకి వస్తే .. షో రూమ్ లోనే కొనుగోలు దారిని వివరాలను వాహన పోర్టల్ లో డీలర్ నమోదు చేస్తారు. ఆ తర్వాత రవాణా శాఖ అధికారి డిజిటల్ అనుమతి ఇచ్చిన వెంటనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం 6 లక్షల ద్విచక్ర వాహనాలు,1.75 లక్షల కార్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ వాహన్ సారధి పోర్టల్ ద్వారా జరుగుతుంటాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News