తెలంగాణలో రైతులకు రుణమాఫీ కాని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల రైతుల రుణ మాఫీ కాలేదు. కొందరు పేర్లు, మరికొందరికి పట్టాలో తప్పులు ఉండడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ప్రభుత్వం కావాలనే కొందరికి రుణ మాఫీ చేయలేదనే విమర్శలు వచ్చాయి. కేవలం 40 శాతం మాత్రమే రుణ మాఫీ చేశాయని ప్రతిపక్షాలు సైతం ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రదేశాల్లో రుణ మాఫీ కానీ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయినా రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో తాజాగా ఓ టెక్నాలజీని అందుబాటలోకి తీసుకొచ్చింది. రైతు రుణ మాఫీ సమస్యల పరిష్కారానికి ఓ అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే Rythu Bharosa (V6.0).
ఈ యాప్ కు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. ఆదివారం అన్ని డివిజన్ల వ్యవసాయ అధికారులు, మండల అధికారులకు దీనికి సంబంధించిన వివరాలను పంపించారు. సంబంధిత అధికారులు రైతు రుణమాఫీ సమస్యలు ఉన్న రైతుల ఇళ్లల్లోకి వెళ్లి వారి సమస్యలను ఇందులో నమోదు చేస్తారు. ఆ తరువాత వారి నుంచి ధ్రువీకరణ కోసం మాన్యువల్ గా ఓ పత్రాన్ని తీసుకుంటారు.
ఈ సర్వేను మంగళ వారం నుంచి ప్రారంభించనున్నారు. రూ 2 లక్షలలోపు రుణం సమస్యలు ఉన్న రైతుల వివరాలు ఇందులో నమోదు చేస్తారు. మరోవైపు రూ.2 లక్షల తరువాత ఉన్న రుణాల గురించి కూడా ప్రభుత్వం చర్చించింది. రూ. 2 లక్షల పై ఉన్న మొత్తాన్ని బ్యాంకుకు జమచేస్తే రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని బ్యాంకులు సైతం అనుమతి ఇచ్చాయి. దీంతో రైతుల రుణ మాఫీ సమస్యకు చెక్ పెట్టినట్లేనని భావిస్తున్నారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన Rythu Bharosa (V6.0) యాప్ ను ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పరిశీలించారు. ఈ యాప్ ను మొబైల్ లో ఇన్ స్టార్ చేసుకొని అధికారులు రైతుల ఇళ్లల్లోకి వెళ్తారు. రైతు రుణాలకు సంబంధించినపత్రాలతో పాటు ఫ్యామిలీ ఫొటోను తీసుకుంటారు. ఇందులో తమ వివరాలను అధికారికంగా ఇచ్చినట్లు కుటుంబ సభ్యుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుంటారు. అయితే రైతులు అధికారులు వచ్చే సమయానికి సంబంధిత పత్రాలను అందుబాటులో ఉంటే సమస్య పరిష్కారానికి ఆస్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు.