2014 నుంచి తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు అందించారు. ఆ తరువాత రుణ మాఫీ ని ప్రకటించారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతోంది. ఇప్పటికే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ప్రకటించగా.. అందులో రూ. 1.50 వేల వరకు అందించారు. ఆగస్టు 15 వరకు మొత్తం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది.
అదే రైతు బీమా.. రైతు బీమాను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే గతంలో రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నా బాండ్ రానివారు.. కొత్తగా పాస్ బుక్ లు వచ్చిన వారికి రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఈ గడువును ఆగస్టు 5 వరకు విధించారు. ఈ నేపథ్యంలో అర్హతలు ఉన్న వారు రైతు బీమా కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరుతున్నారు. అయితే రైతు బంధుకు ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే..?
ఎవరి పేరున భూమి వ్యవసాయ భూమి 2024 జూలై 28 తేదీ వరకు రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో వారు 18 నుంచి 59 ఏళ్ల వయసులోపు ఉండాలి. అంతేకాకుండా ఆధార్, పాస్ బుక్ ఆధారంగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు అన్నీ ఉంటే రైతు పేరిట ప్రత్యేకంగా బాండ్ ఇస్తారు. ఈ బాండ్ ను భద్రపరుచుకోవాలి. ఒక వేళ రైతు ప్రమాదవశాత్తూ ఎటువంటి పరిస్థితుల్లో మరణించినా నామినికి రూ. 5 లక్షలు చెల్లిస్తారు. ఈ మొత్తం 10 రోజుల్లోనే అందిస్తారు.
రైతు బీమా పొందాలంటే రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే రైతుల తరుపున లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెల్లిస్తుంది. గతంలో ప్రభుత్వం రూ. 2,271 చెల్లించేది. ప్రస్తుతం రూ.3,556 చొప్పున అందిస్తుంది. అందువల్ల అర్హత ఉన్న రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.