కొన్ని రోజుల పాటు ఇక బంగారం కొనడం కష్టమే అనుకున్న వాళ్లకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. బంగారం ధరలు వరుసగా తగ్గుతునన్నాయి. రూ. 80 వేల వరకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా 10 గ్రాముల బంగారం రూ.64 వేలకు దిగి వచ్చింది. కేంద్ర బడ్జెట్ లో బంగారంపై సుంక తగ్గింపు ప్రకటించినప్పటి నుంచి ఈ ధరలు మరీ పతనం అవుతున్నాయి. వరుసగా వారం రోజుల పాటు స్వల్ప మొత్తంలో ధరలు తగ్గుముఖం పడుతుండగా మూడు రోజుల్లో మాత్రం భారీ స్థాయిలో దిగి వచ్చాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునవారు ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదని అనుకుంటున్నారు.
బులియన్ మార్కెట్లో ప్రకారం బంగారం ధరలు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000 పలుకుతోంది. 24 క్యారె్ట్ల బంగారం రూ.69,820గా నమోదైంది. ఢిల్లీలో ఈ బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,150 పలుకుతోంది. 24 క్యారె్ట్ల బంగారం రూ.69,950గా పలుకుతోంది. గురువారం కంటే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 950 తగ్గింది. 24 క్యారె్ట్ల బంగారం రూ.1040 తగ్గింది.
అంతుకుముందు వరుసగా రూ.2,3 వేలు తగ్గుతూ మొత్తంగా వారం రోజుల్లో 5 వేలకు పైగా తగ్గింది. బంగారం ధరలు జూలై 17న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,750 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ.75,000గా ఉండేది. ఆ తరువాత 18 నుంచి తగ్గుతూ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.5 వేలకు పైగా బంగారం ధరలు తగ్గడం విశేషం. అయితే ఈ పరిస్థితి పెట్టుబడుదారులకు నిరాశ కలిగించినా కొనుగోలు దారులకు మాత్రం మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఎందుకంటే పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం ఊరట కలిగిస్తోంది దీంతో చాలా మంది మహిళలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.