Saturday, December 6, 2025

దాల్చిన చెక్కను ఏ చెట్టు నుంచి తీస్తారు? మార్కెట్లోకి ఎలా వస్తుంది?

మనిషి ఆరోగ్యానికి నాణ్యమైన ఆహారం అవసరం. నాణ్యమైన ఆహారం అంటే అన్నంతో పాటు వేసుకునే కూరలో కొన్ని పదార్థాలను వేయడం. కూర వండే క్రమంలో ఆయిల్ తో పాటు పసుపు, ఉప్పు, కారం వంటివి వేస్తుంటాం. కానీ మాంసాహారం వండే సమయంలో కొన్ని మసాలాలు యాడ్ చేస్తాం. ఈ మసాలాల్లో దాల్చిన చెక్క (Cinnamon) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది మాంసాహారంలో వేయడం వల్ల సువాసన రావడంతో పాటు మంచి రుచిని కూడా అందిస్తుంది. అంతేకాకుండా ఇది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మరి ఈ దాల్చిన చెక్క ఎలా తయారవుతుంది? దీనిని ఎక్కడ పండిస్తారు?

దాల్చిన చెక్క ఒక సుగంధ ద్రవ్యం. దీనిని చెట్టు బెరడు నుంచి తీస్తారు. Cinnamomum(సిన్నమోముమ్) అనే జాతికి చెందిన చెట్ల నుంచి తీస్తారు. దీనిని ముందుగా శ్రీలంక దేశంలో కనుగొన్నారు. ఆ తరువాత దక్షిణ భారత దేశంలోని కేరళలో ఎక్కువగా పండిస్తారు. దాల్చిన చెక్క రెండు రకాలుగా ఉంటుంది. వీటిలో ‘సిలాన్’ దాల్చిన చెక్క ఎక్కువగా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఇది లైట్ గోధుమ రంగులో ఉంటుంది. రెండోది ‘కాసియా’ దాల్చిన చెక్క. మనం ప్రస్తుతం వాడేది ఇదే. దీనిని ఎక్కువగా చైనా, ఇండోనేషియా, వియత్నాంలో పండిస్తారు. ఇది ఎర్ర రంగులో ఉంటుంది. ఇందులో కుమారిన్ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది. దీంతో దీనిని అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.

దాల్చిన చెక్కను చెట్టు నుంచి ముందుగా బెరడు తీస్తారు. ఆ తరువాత దీనిని ఎండబెడుతారు. అయితే కొందరు దీనిని నేరుగా మార్కెట్లోకి తీసుకొస్తారు. మరికొందరు. దీనిని చుట్టలాగా చుట్టి తీసుకొస్తారు. దాల్చిన చెక్కను కూరల్లో వాడుతూ ఉంటారు. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ నియంత్రణ అవుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల బాక్టీరియాను నివారించవచ్చు. దీనిని కేవలం కూరల్లో మాత్రమే కాకుండా ఆయుర్వేద మందుల తయారీల్లోనూ వాడుతారు. అయితే దాల్చిన చెక్కను గర్భవతులు, పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News