Thursday, February 6, 2025

స్వర్ణయుగం నుంచి కష్టాల్లోకి..! సినిమా థియేటర్ల బంద్ కు కారణం ఎవరు?

ప్రతి మనిషి నిత్యం ఏదో ఒక పనిలో పడి బిజీ వాతావరణంలో ఉంటాడు. దీంతో రిలాక్స్ కావడానికి ఒకప్పుడు టీవీలు మాత్రమే చూసేవారు. కానీ 1980 నుంచి సినిమా థియేటర్లలో మంచి సినిమాలు రావడంతో టీవీల నుంచి థియేటర్లకు పరుగులు పెట్టారు. 20 దశాబ్దంలో డైరెక్టర్లు సైతం శ్రద్ధ ఉంచి మంచి సినిమాలను జనాల్లోకి తెచ్చారు. ఒక సినిమా ద్వారా కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చూపించేవారు. దీంతో చాలామంది సినిమా చూడడం ఒక పనిగా పెట్టుకున్నారు. ఇక కొందరు స్థార్ హీరోలు ఆ కాలంలో మంచి సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకునేవాళ్లు. ఆ క్రమంలో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ గా మారి వారి సినిమాలను కచ్చితంగా చూసేవారు.

వినోదం కోసం ఒకప్పుడు టీవీలు చూసేవాళ్లు.. ఆ తరువాత సినిమా థియేటర్లకు పరుగులు పెట్టారు. కానీ ఏ క్షణమైతే చేతిలోకి స్మార్ట్ మొబైల్ వచ్చిందో.. సినీ ఇండస్ట్రీకి కష్టాలు మొదలయ్యాయి. థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాను రోజుల తేడాల్లోనే మొబైల్లోనే చూడడానికి చాలా మంది అలవాటు పడ్డారు. దీంతో థియేటర్లకు వెళ్లడం మానేశారు. ఫలితంగా సినిమా ఇండస్ట్రీ రాను రాను దెబ్బతింటోంది. మరోవైపు థియేటర్లో టికెట్ రేట్లు విపరీతంగా పెంచడంతో ప్రేక్షకులు సినిమా కోసం ఖర్చు పెట్టడానికి వెనుకాడుతున్నారు. తాజాగా సినిమా థియేటర్లకు 10 రోజులు హాలీడే ప్రకటించారు. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? స్వర్ణయుగంలా ఉన్న సినీ ఇండస్ట్రీకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి?

1980 నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీ స్వర్ణలోకంగా మారింది. హీరోలో పోటీ పడి సినిమాలో తీసేవారు. డైరెక్టర్లు కథ కోసం తీవ్రంగా శ్రమించేవారు. ఒక సినిమా పూర్తి చేయడానికి తిండి తిప్పలు మానేసి ఫ్యామిలీకి సైతం దూరంగా ఉండేవారు. అలా వారు పడ్డ కష్టానికి ఫలితం ఉండేది. అప్పట్లో వచ్చిన సినిమాల్లో కంటెంట్ ఉండండంతో పాటు నటులు సైతం ప్రాణం పెట్టి పనిచేసేవారు. దీంతో సినిమాను ఒక సినిమా గా కాకుండా తమ జీవితంలో జరిగే ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుడు భావించాడు. దీంతో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా కుటంబమంతా సినిమాలను ఎగబడి చూసేవారు.

2000 సంవత్సరం తరువాత సినిమాకు పైరసీ చీడపీడలా తయారైంది. ఆ సమయంలో సినిమా రిలీజ్ అయిన తరువాత కొందరు సినిమాను పైరసీ సీడీల్లో సినిమాలను విక్రయించేవారు. దీని వల్ల కొంత వరకు మాత్రమే నష్టం జరిగింది. కొంత మంది సినిమాను రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఇంట్లో చూడొచ్చని భావించినా.. థియేటర్లో చూసే మజా వేరు అని మరికొందరు అనకునేవారు. దీంతో పైరసీ సినిమాను పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

కానీ ఆ తరువాత మొబైల్ రంగంలోకి దిగిన తరువాత సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. స్మార్ట్ మొబైల్ చేతిలోకి వచ్చాక సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోలు రిలీజ్ కావడం.. ఆ తరువాత సినిమానే మొబైల్ లోకి వచ్చే విధంగా తయారైంది. దీంతో చాలా మంది కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమా థియేటర్లోకి వెళ్లడం మానేసి.. మొబైల్ లోకి ఎప్పుడు మూవీ వస్తుందా? అని ఎదురుచూశారు. ఇక రాను రాను కొన్ని వెబ్ సైట్లు నేరుగా సినిమాను రిలీజ్ రోజు పెట్టాయి.

ఈ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై బాగా పడింది. సినిమా రిలీజ్ అయిన రోజే వెబ్ సైట్ లోకి రావడంతో ఆ సినిమా గురించి తెలిసి థియేటర్లోకి రావడం మానేశారు. దీంతో కొన్ని రోజుల తరువాత సినిమా గురించి ముందే తెలియాలని టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయడం ప్రారంభించారు. కానీ ఆ తరువాత కొన్నిరోజులు థియేటర్లోకి నడిపించిన తరువాత ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ద్రవ్యోల్భణం, పలు కారణాల వల్ల సినిమా టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభావం మరింత పడింది. కష్టాల మీద కష్టాలు అన్నట్లు సాధారణ థియేటర్ల స్థానంలో మల్టీఫ్లెక్స్ లు వచ్చాయి. ఇలా మొత్తానికి 70 ఎంఎం స్క్రీన్ మరుగునపడడం ప్రారంభమైంది. ఇప్పుడు ఏకంగా 10 రోజలు పాటు హాలీడే ప్రకటించారు. ఇక ముందు ముందు సినిమా రంగం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

సినిమా ఇండస్ట్రీ కాలానికి అనుగుణంగా మారుతున్నా.. ప్రేక్షకుడిని దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీయాలని చాలా మంది కోరుతున్నారు. కొందరు అవార్డుల కోసం.. తాత్కాలిక సందపాదన కోసం కాకుండా సమయం తీసుకొని మంచి సినిమాలు తేవాలంటున్నారు. ఈరోజుల్లో సినిమాలను ఆదరించడం లేదని కొంతమంది అంటున్నారు. భారీ బడ్జెట్ ఉంటేనే ప్రేక్షకులు వస్తున్నారని చెబుతున్నారు. కానీ బలగం లాంటి సినిమాకు ఎంత బడ్జెట్ కేటాయించారో అందరికీతెలిసిందే. ఈ సినిమా ఎలాంటి పబ్లిసిటీ లేదన్న విషయం తెలియంది కాదు. ఇప్పటికైనా కొత్త కథలతో వినోదాన్ని పంచే సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News