కొందరు రైతులు కాడెద్దులను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. వాటితో వ్యవసాయ పనులు చేయించుకున్నా..వాటికి ఏ చిన్న ఆపద వచ్చినా ఆవేదన వ్యక్తం చేస్తారు. దీంతో ఆ ఎద్దులు కూడా కుటుంబ సభ్యుల్లో కలిసిపోతాయి. అయితే తన వ్యవసాయానికి ఎంతో ఆసరాగా ఉన్న కాడెద్దులు ప్రమాదవశాత్తూ నదిలోకి పడిపోవడంతో రైతు తల్లడిల్లాడు. దీంతో వాటిని కాపాడేందుకు నదిలోకి దూకాడు. ఆ తరువాత ఏం జరిగిందంటే?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లా పరాయి గ్రామంలో ఓ నది వరద ఉధృతంగా పారుతోంది. అయితే ఓ రైతు తన వ్యవసాయ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో నదీ వరద ఎక్కువైంది. దీంతో నది పక్కన ఎడ్ల బండితో ఉండిపోయాడు. అయితే వరద్ ఉధృతి పెరగడంతో ఎడ్లబండితో నదిలో పడిపోయింది. దీంతో రైతు ఒక్కసారిగా నదిలోకి దూకాడు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తన రెండు ఎద్దులను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవి పశువులే అయినా తన సొంత బిడ్డల్లా చూసుకోవడంతోనే రైతు వాటి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయలేదని పలువురు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా రైతులకు, ఎద్దులకు మధ్య ఉన్న అనుబంధం ఇదే కదా అని కామెంట్ పెడుతున్నారు.





