గత కొన్నాళ్లుగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అందరూ భావించారు. అందుకే కొన్ని రోజుల కిందట బంగారం ధరలు కాస్త తక్కువ కాగానే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు బంగారం ధరలు గుడ్ న్యూస్ చెబుతున్నాయి. రెండు రోజులుగా బంగారం ధరలు పడిపోయాయి. దీంతో బంగారం కొనడానికి ఇదే మంచి ఛాన్స్ అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు స్పాట్ గోల్డ్ కు 2530 డాలర్లకు చేరుకుంది. అయితే కొన్ని రోజుల పాటు ఈ ధరలు దిగుతూ వస్తున్నాయి. శుక్రవారం స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2498కి దిగింది. ఈ ప్రభావం దేశీయ బంగారం ధరలపై పడింది. దీంతో ఢిల్లీ మార్కెట్లో ప్రస్తుతం తులం బంగారానికి రూ.72,910 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,680 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 72,750కి పడిపోయింది.
ఇవే ధరలు బుధవారం రూ.66,690 ఉండగా.. గురువారం స్థిరంగా కొనసాగాయి. శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. అంటే కొన్ని రోజుల పాటు బంగారం దిగొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగారం ధరలు చెన్నైలో 22 క్యారెట్లు 66,680..24 క్యారెట్లు 72,750 ఉన్నాయి. ముంబయ్ లో 22 క్యారెట్లు 66,680.. 24 క్యారెట్లు 72,750తో విక్రయిస్తున్నారు. ఇవే ధరలు బెంగుళూరులోనూ సమానంగా ఉన్నాయి.
వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో తులం వెండి రూ. 900 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం వెండి 90 వేల వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ మార్కెట్లో మాత్రం ఇవి రూ.85 వేలతో విక్రయిస్తున్నారు.