Saturday, December 6, 2025

భారీగా నకిలీ Colgate Tooth Pastల పట్టివేత..

మొన్నటి వరకు పాలు కల్తీ.. నిన్న ఆల్లం పేస్ట్ కల్తీ.. ఇప్పుడు కొత్తగా టూత్ పేస్ట్ కూడా కల్తీగా మారిపోయింది. ఉదయం లేవగానే నోటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే colgate టూత్ పేస్ట్ కూడా కల్తీగా మారిపోయింది. దేశంలో ఎంతో మంది వినియోగిస్తున్న ఈ టూత్ పేస్ట్ పేరిట కొందరు నకిలీ సరుకును మార్కెట్లోకి తీసుకువచ్చారు. వీటిని తాజాగా పోలీసులు పట్టుకున్నారు. వాటి వివరాల్లోకి వెలితే..

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో తాజాగా నకిలీ టూత్ పేస్ట్ లను పట్టుకున్నారు. రాపర్ తాలూకాలోని చిత్రోడ్ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసిన గడోదర్ పోలీసులు.. నకిలీ colgate టూత్‌పేస్ట్‌ను తయారు చేస్తున్న అక్రమ కార్యకలాపాన్ని ఛేదించారు. దాడి తర్వాత, పోలీసులు అసలైన కంపెనీని సంప్రదించగా, ఆ ఉత్పత్తులు అసలైనవి కావని కంపెనీ ధ్రువీకరించింది. పోలీసుల నివేదికల ప్రకారం.. కొందరు చౌకైన, నాసిరకం పదార్థాలను ఉపయోగించి టూత్‌పేస్ట్‌ను తయారు చేశారు. ఆపై దానిని అసలు కోల్గేట్ ఉత్పత్తులుగా మార్కెట్‌లో విక్రయించి, అనుమానం లేని వినియోగదారులను మోసం చేశారు. పోలీసులు నకిలీ టూత్‌పేస్ట్ బ్యాచ్‌లు, ప్యాకింగ్ మెటీరియల్‌లు మరియు ఉత్పత్తి పరికరాలతో సహా సుమారు ₹9.43 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అందరూ నలియాటింబా, తాలూకా రాపర్ నివాసితులే. వారిపై మోసం, కాపీరైట్ ఉల్లంఘనతో పాటు, వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగించినందుకు సంబంధించిన సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. నకిలీ వస్తువుల ఉత్పత్తి ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదాలను కలిగిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. నకిలీ టూత్‌పేస్ట్ బ్యాచ్‌లు రాష్ట్రంలో ఎక్కడెక్కడ పంపిణీ అయ్యాయో తెలుసుకోవడానికి సరఫరా గొలుసును ఛేదించేందుకు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

అయితే కోల్గేట్ టూత్ పేస్ట్ ను కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెటింగ్ నిపుణులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ అధికారిక డీలర్లు, పెద్ద సూపర్ మార్కెట్‌లు, లేదా బాగా పేరున్న రిటైల్ చైన్ స్టోర్ల నుండి మాత్రమే టూత్‌పేస్ట్ కొనాలి. నమ్మకం లేని ఆన్‌లైన్ వెబ్‌సైట్ల నుండి కొనుగోలు చేయవద్దు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు ఏదైనా ఉత్పత్తి లభిస్తుంటే, అది నకిలీ అయ్యే అవకాశం ఉంది. ధరలో అధిక వ్యత్యాసం ఉన్నట్లయితే, అనుమానించాలి. కొనుగోలు చేసేటప్పుడు టూత్‌పేస్ట్ బాక్స్‌ను, ముఖ్యంగా మూతలు సరిగ్గా ఉన్నాయో లేదో, మరియు ప్యాకేజింగ్ కొత్తగా, దెబ్బతినకుండా ఉందో లేదో తనిఖీ చేయండి.మీరు కొనుగోలు చేసిన ఉత్పత్తి నకిలీది అని బలమైన అనుమానం ఉంటే, దానిని ఉపయోగించవద్దు. వెంటనే కంపెనీ వినియోగదారుల సేవా కేంద్రాన్ని (Consumer Affairs) సంప్రదించి లేదా స్థానిక పోలీసులకు లేదా వినియోగదారుల రక్షణ సంస్థలకు ఫిర్యాదు చేయండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News