భవిష్యత్ కాలం అంతా రోబోలమయం అని కొందరు అంటున్నారు. ఇప్పటికే Artificial Intelligence (AI)విజృంభించడంతో మానవ వనరులు తగ్గిపోతున్నాయి. అయితే తాజాగా ఓ వీడియో హల్ చల్ సృష్టిస్తోంది. ఓ రోబో డెట్రాయిట్ రోడ్డుపైకి వచ్చి మనిషి లాగే ప్రవర్తిస్తోంది. అక్కడున్న పేదలను పలకరిస్తూ.. వారికి హాయ్ చెబుతోంది.. దీనిని ‘ఎలన్ మస్క్’వీడియో jilliblackwellఅనే వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ఒక రోబో అటూ ఇటూ తిరగుతూ ఉంటుంది. మనుషులకు హాయి చెబుతూ ఉంటుంది. కానీ దీని గురించి మరింత సెర్చ్ చేస్తే ఇది ఫేక్ వీడియో అని తేలిసింది. దీనిని కొందరు ఏఐ ద్వారా సృష్టించారని చెబుతున్నారు.
ఎలన్ మస్క్ ప్రస్తుతం తన టెస్లా, స్పేస్‌ఎక్స్, AI కంపెనీలతో బిజీగా ఉంటున్నారు. ఆయన నిజంగా రోబోగా మారడం అసాధ్యం అని కొందరు నిపుణులు అంటున్నారు. కానీ దీనికి “Elon Musk robot spotted in Detroit!” అని పోస్టు పెట్టారు. ఇది ఫేక్ అయినా.. వీడియో ఆసక్తిగా ఉండడంతో చాలా మంది దీనిని వీక్షిస్తున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం భవిష్యత్ లో మనుషుల స్థానంలో రోబోలు ఉంటాయని కొందరు అంటున్నారు. ఏదీ ఏమైనా ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.





