పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతకీ తగ్గకపోవడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే టూవీలర్, 4 వీలర్ వెహికల్స్ విద్యుత్ కు సంబంధించినవే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కూడా రాబోతుంది. విద్యుత్ తో నడినే ఓ ట్రాక్టర్ ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి చేశాడు. ఈ ట్రాక్టర్ ద్వారా రైతులకు ఎంతో ఉపయోగపడనుందని ఆయన చెబుతున్నాడు. వ్యవసాయ పనులను ఈ ట్రాక్టర్ తో ఈజీగా చేసుకోవచ్చని అంటున్నాడు. అసలు విషయమేంటంటే ఈ ట్రాక్టర్ నడపడానికి డ్రైవర్ అవసరం లేదు. రిమోట్ కంట్రోల్ ఆధారంగా దీనిని వాడుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రకు చెందిన సిద్దార్థ్ గుప్తా అనే యువకుడు ఇంజనీరంగ్ పూర్తి చేసిన తరువాత ఉద్యోగంలో చేరాడు. అయితే మార్కెట్లో విద్యుత్ వాహకంతో నడిచే వాహనాలను చూసిన తరువాత ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను కూడా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. దీంతో వీఆర్డీ మోటార్స్ అనే కంపెనీ తయారు చేసిన తరువాత 15 Hp, 50 Hp అనే రెండు ట్రాక్టర్లను తయారు చేశాడు. ఈ ట్రాక్టర్లు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 10 నుంచి 15 గంటల వరకు నిర్వారామంగా పనిచేస్తుంది.
అయితే ఇందులో సోలార్ ద్వారా ఎలక్ట్రిక్ ను ఉత్పత్తి చేసుకునే మరో బ్యాటరీ ఉంటుంది. సోలార్ ద్వారా కరెంట్ ఉత్పత్తి కావడంతో కూడా ట్రాక్టర్ పనిచేస్తుంది. పేటెంట్ హక్కు సైతం పొందిన ఈ ట్రాక్టర్ ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో రన్ అవుతోంది. అయితే ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఒకవేళ మార్కెట్లోకి వస్తే 15 Hp ట్రాక్టర్ రూ.3 నుంచి 4 లక్షలు, 50 Hp ట్రాక్టర్ రూ.10 నుంచి 12 లక్షల ధరతో విక్రయించే అవకాశం ఉందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు.
పూర్తిగా దేశీయ టెక్నాలజీతో అభివృద్ధి చెందిన ఈ ట్రాక్టర్ అందుబాటులోకి వస్తే రైతుల కష్టాలన్నీ తీరినట్లేనని సిద్ధార్థ చెబుతున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ చాలా వరకు అవసరం ఉంటుంది. అంతేకాకుండా డీజిల్ ఖర్చులు తడిసి మోపెడతుతున్నాయి. ఈ ట్రాక్టర్ ఓ వైపు విద్యుత్ తో పాటు మరోవైపు సోలార్ సిస్టమ్ తో పనిచేయడం వల్ల ఎంతో ఆదాయం ఆదా అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిని మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి..