ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్నో రకాల అనర్థాలు జరుగుతాయని చాలా మందికి తెలుసు. కానీ తప్పని పరిస్థితుల్లో ఒక్కోసారి ప్లాస్టిక్ వస్తువులు వాడాల్సి వస్తుంది. అయితే ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా కొన్ని అందబాటులోకి వస్తున్నా.. ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ప్లాస్టిక్ వస్తువులను మాత్రమే వాడుతున్నారు. దీంతో దేశంలో Plastic Wastage రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఈ వేస్టేజ్ ను తొలగించడానికి ఆయా ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్లాస్టిక్ వేస్టేజ్ తో ఎరువు, ఇతర వస్తువుల తయారు చేయడానికి ముందుకు వస్తున్నా.. అనుకున్న స్థాయిలో విజయవంతం కావడం లేద. కానీ ఓ వ్యక్తి మాత్రం ప్లాస్టిక్ వేస్టేజ్ ను ఉపయోగకరంగా మార్చి ‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?

తమిళనాడులోని మధురైకి చెందిన రాజగోపాలన్ వాసుదేవన్ రసాయశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ నుతొలగించాలని అనుకున్నాడు. దేశంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కనిపించేసరికి ఆయన దీని గురించి ఎక్కువగా ఆలోచించేవారు. అయితే దీనిని ఉపయోగకరంగా మార్చుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా తారు రోడ్డు వేసే కంకరను తీసుకొని దానిని 170 సెల్సీయస్ డిగ్రీలో వేడి చేశాడు. ఇందులో చిన్న చిన్నగా తయారు చేసిన ప్లాస్టిక్ ను వేశాడు. దీంతో ఈ వేడికి ప్లాస్టిక్ మిల్ట్ అయి స్టోన్ తో కలిసి పోతుంది. ఈ మిశ్రమానికి తారు యాడ్ చేసి రోడ్డు వేయించాడు.

ఈ రోడ్లు నార్మల్ రోడ్ల కంటే ఎంతో నాణ్యతగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 10 ఏళ్ల వరకు ఇవి నాణ్యమైనవిగా ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే 1 కిలోమీటర్ రోడ్డుకు 1 టన్ను ప్లాస్ట్ అవసరం అవుతుందని గుర్తించారు. ఇలా మొదటిసారిగా 2002లో చెన్నైలో జంబులింగం స్ట్రీట్ లో ప్లాస్టిక్ రోడ్డును వేశారు. అలా ఇప్పటి వరక లక్ష కిలోమీటర్ల వరకు ప్లాస్టిక్ రోడ్డును వేయించారు.

రాజగోపాలన్ వాసుదేవన్ కనిపెట్టిన దీనికి ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కు తీసుకున్నారు. అయితే ఈ రైట్స్ కోసం విదేశాల్లోని కొన్ని కంపెనీలు వేల కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ వాసుదేవన్ మాత్రం భారత ప్రభుత్వానికి ఉచితంగా దీనిని అందించారు. అయితే రాజగోపాలన్ చేసిన ఈ కృషికి 2018లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ప్లాస్టిక్ వేస్ట్ ను ఇంతగా ఉపయోగించిన రాజగోపాలన్ లాగా మీరు కూడా కొత్త పద్ధతిని కనిపెట్టి ఆదర్శంగా నిలవండి..





