ప్రకృతిలో లభించే సున్నితమైన.. సువాసన కలిగిన పూలు అంటే మహిళలు చాలా ఇష్టం. కొందరు ప్రతిరోజూ తలలో పూలు ధరించకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లరు. కొన్ని శుభకార్యక్రమాల్లో అయితే కొప్పు పూలతో నిండిపోతుంది. ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో తమ ఇంటి ముందు పూల చెట్లు పెంచుకునేవారు. వాటి ద్వారా తమ అవసరాలు తీర్చుకునేవారు. కానీ ఇప్పుడు పట్టణాల్లో అందుబాటులో పూలు ఉండడం లేదు. దీంతో మార్కెట్ కు వెళ్లి పూలు కొనుక్కుంటున్నారు.
ప్రస్తుత కాలంలో పూల అవసరం విపరీతంగా ఉంది. కేవలం మహిళల తలలో ధరించడానికి మాత్రమే కాకుండా దేవుళ్ల పూజలకు, కార్ డెకరేషన్ కోసం, ఏదైనా శుభకార్యక్రమాలు నిర్వహించడానికి విపరీతంగా వాడుతున్నారు. పూల డిమాండ్ ను భట్టి ప్రత్యేకంగా పూల మార్కెట్ లు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ లో గుడి మల్కాపూర్, మోండా మార్కెట్, జాంబాంగ్ పూల మండి వంటివి ప్రత్యేకంగా నిలుస్తాయి. అయితే ఆసియాలోనే అతిపెద్ద పూల మార్కెట్.. మన భారతదేశంలో ఉంది. అది ఎక్కడ ఉంది? దీని విశేషాలేంటి?

ఆసియాలో అతిపెద్ద పూల మార్కెట్ గా పేరు తెచ్చుకుంది కలకత్తాలోని ముల్లిక్ ఘాట్ ఫ్లవర్ మార్కెట్.. ఈ నగరంలోని హౌరా బ్రిడ్జ్ (Howrah Bridge) కింద హూగ్లీ నది ఒడ్డున దీనిని నిర్వహిస్తారు. ఇక్కడ రోజూ సుమారు 3 వేల మంది వ్యాపారులు పూలు విక్రయిస్తారు. రోజుకి 100 టన్నుల కంటే ఎక్కువగా పూల వ్యాపారం సాగుతుంది. ప్రతిరోజూ కోటి రూపాయల వరకు వ్యాపారం అవుతుంది. ఉదయం 4 గంటలకే ఈ మార్కెట్ ప్రారంభం అవుతుంది. అనేక రకాల పూలతో ఈ ప్రాంతం సువాసనను వెదజల్లుతుంది. ఇక్కడ గాదీలు, మల్లెలు, గులాబీలు, కనకాంబరం, ట్యుబ్ రోస్ (రజనిగంధా), మేరిగోల్డ్ అనే రకాల పూలు ఎక్కువగా విక్రయిస్తారు.
1855లో ఈ మార్కెట్ ప్రారంభమైంది. అందుకే దీనిని అతి పురాతనమైన.. ఆసియాలోనే అతిపెద్ద పూల మార్కెట్లలో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి పూలు పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు, బాంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌లకు కూడా ఎగుమతి అవుతాయి.

ఈ మార్కెట్‌ను ఫోటోగ్రాఫర్ల స్వర్గధామం అని కూడా అంటారు. స్థానిక జీవనశైలిని, రంగుల పుష్పాలను కెమెరాలో బంధించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు వస్తుంటారు. నదీ ఒడ్డున ఉన్నందున, పుష్పాల తోరణాలు, ఎర్రటి గాదీ పూల వలయాలు, పూల బస్తాలన్నీ అందంగా ఉంటాయి. ఇక్కడ చాలా తక్కువ ధరలకు పూలు లభిస్తాయి . Howrah Railway Station కి చాలానే దగ్గరగా ఉంటుంది (చాలా మంది నడుచుకుంటూ వెళ్తారు). Kolkata cityలోని ప్రధాన ప్రాంతాలనుండి బస్సులు, టాక్సీలు, మెట్రో ద్వారా సులభంగా చేరవచ్చు.





