రోడ్డుమీద ఎవరికైనా డబ్బు కనిపిస్తే ఏం చేస్తారు? లక్ష్మీదేవి కనిపించింది అని చక్కగా జేబులో వేసుకొని వెళ్తారు. అలాగే డబ్బులు ఉన్న ఒక బ్యాగు కనిపిస్తే ఏం చేస్తారు? వెంటనే దానిని ఇంటికి తీసుకెళ్ళి అందులో ఉన్న నగదును వాడుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సినిమాల్లో ఇలా డబ్బుల మూట కనిపిస్తే దానిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించి.. కావలసినవారికి అందిస్తారు. ఇది సినిమాల్లోనే కానీ.. రియల్ గా జరగదు అని చాలామంది అభిప్రాయం. అయితే స్కూలుకు వెళ్లే ఓ విద్యార్థి మాత్రం దీనిని నిజం చేశాడు. అసలు స్టోరీ ఏంటంటే?
ఇటీవల ఒక పిల్లవాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిశాడు. తనతో కలిసి ఫోటోలు దిగాడు. సాధారణంగా ఒక వ్యక్తి రజనీకాంత్ ను కలవాలంటే ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. కానీ రజనీకాంత్ స్వయంగా ఆ పిల్లవాడిని ఇంటికి పిలిపించి తనతో ఫోటోలు దిగి ఒక గోల్డ్ చైన్ ను అప్పగించాడు. అందుకు కారణం ఏమిటంటే?

తమిళనాడులో యాసిన్ అనే ఒక పిల్లవాడు రోడ్డుపై వెళ్తుండగా తనకు డబ్బులు ఉన్న బ్యాక్ కనిపించింది. దీనిని తీసుకెళ్లి తన టీచర్కు అందించాడు. ఆ టీచర్ పోలీస్ స్టేషన్లోకి వెళ్లి దానిని అప్పగించారు. ఇదే సమయంలో తనకు డబ్బులు ఎవరిచ్చారు? అని పోలీసులు ఆ టీచర్ ను అడగగా.. బ్యాగు గురించి చెప్పారు. దీంతో ఆ పిల్లవాడిని పిలిపించి పోలీసులు అభినందించారు. అంతేకాకుండా ఆ పిల్లవాడిని ఇందులో డబ్బులు ఉన్నాయి కదా.. దీనిని ఎందుకు తీసుకోలేదు? అని అడిగారు. అప్పుడు యాసిన్ చెప్పిన సమాధానం ఏంటంటే.. ఈ డబ్బులు ఎవరివో? నేను కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు.. అందువల్ల నేను దీనిని వాడుకోలేను.. అని చెప్పాడు. ఆ మాటలకు ఎంతో సంతోషించిన పోలీసులు తనకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు. దీంతో ఏం కావాలో కోరుకోమని పోలీసులు అడిగారు. తనకు సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలవాలని కోరిక ఉందని అన్నాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న రజినీకాంత్ ఆ పిల్లవాడితోపాటు కుటుంబ సభ్యులను పిలిపించి.. తమ బాబుకు ఎన్నో విలువైన విషయాలు చెప్పారని.. డబ్బు మీద కోరిక లేకపోవడం ఎంతో అదృష్టమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఒక గోల్డ్ చైన్ అందించి.. తమ పిల్లాడిని బాగా చదివించాలని చెప్పారు.

అయితే ఎంతో గొప్ప మనసు కలిగిన యాసీన్ చరిత్రను ప్రభుత్వం పాఠ్యాంశాల్లో చేర్చింది. రెండో తరగతిలో ఒక లెస్సన్ గా చేర్చారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటి విషయాలను నేర్పించాలని చెబుతోంది..





