Saturday, December 6, 2025

వీళ్లు రోడ్డుపక్కన పడేసిన దేవుళ్ల ఫొటోలను తీసుకుంటున్నారు.. ఎందుకో తెలుసా?

మనం ఎంతో కాలంగా భక్తితో పూజించిన కొన్ని ఫొటోలను, విగ్రహాలను కొన్నాళ్ల తరువాత పారేస్తాం. అయితే కొందరు పవిత్రంగా వాటిని నదీ తీరాన వేస్తారు. మరొకొందరు మాత్రం ఇష్టం వచ్చినట్లు రోడ్డు పక్కన పడేస్తుంటారు. ఎంతో కాలంగా భక్తి ఉన్న ఆ ఫొటోలు రోడ్డు పక్కన పడేయడం ద్వారా అవి చూడలేని స్థితిలో ఉంటాయి. అంతేకాకుండా ఎంతో కాలంగా రోడ్డు పక్కన ఉండడంతో అవి చెదలు పట్టి వాటి నుంచి బ్యాక్టీరియా వెదజల్లుతోంది. దీంతో సమీపంలోని వారు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తోంది. ఎంతో పవిత్రమైన ఈ ఫొటోలు ఇలాంటి పరిస్థితిలో చూడలేని వారిలో కొందరు సేకరిస్తున్నారు. వాటికి పవిత్రమైన పూజలు చేస్తున్నారు. ఆ తరువాత ఏం చేస్తున్నారో తెలుసా?

బెంగుళూరులోని సంపూర్ణ సేవ ఫౌండేషన్, సంపిగేఫౌండేషన్, HSR సిటిజన్ ఫోరమ్ వంటి బృందాలు.. ఏడాదికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కలుస్తారు. వీరి అప్పటి వరకు గుడి వద్ద.. నదీ తీరాన.. చెట్ల పక్కన పడేసిన దేవుడి చిత్రాలను సేకరిస్తారు. వీరు తీసుకు వచ్చిన వాటిని ఒక్కచోట చేరుస్తారు. వీటికి ఒక అర్చకుడు వచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఆ తరువాత వాటిటో అరుదైన చిత్రాలు ఉంటే వాటిని కావాల్సిన వారికి ఇస్తారు. పూర్తిగా ధ్వంసం అయిన చిత్రాలు ఉంటే వాటిని రీ సైక్లింగ్ చేస్తారు.పూర్తిగా చిరిగిపోయిన లేదా పాడైపోయిన ఫొటోలను, వాటిపై ఉన్న ప్లాస్టిక్ లేదా గ్లాస్‌ను వేరు చేస్తారు. ఆ కాగితపు భాగాన్ని ఒక పవిత్రమైన హోమం (ఉద్వాసన పూజ) ద్వారా దేవుడి నుంచి ఆ శక్తిని వెనక్కి తీసుకునే ప్రక్రియ తర్వాత, వాటిని పేపర్ రీసైక్లింగ్ యూనిట్లకు పంపిస్తారు. ఆ పేపర్‌తో చేతితో తయారుచేసిన పేపర్ (Handmade Paper) లేదా నోట్‌బుక్స్‌గా మార్చుతారు. ఫొటో ఫ్రేములలో ఉండే చెక్క, ప్లైవుడ్‌లను చిన్న చిన్న ముక్కలుగా చేసి, పిప్పిగా మారుస్తారు.

ఈ చెక్క పిప్పి (Sawdust) లేదా పొట్టును ప్లాస్టిక్ లేదా రసాయన రహిత కలపగా మారుస్తారు, లేదా కంపోస్ట్ (ఎరువు) తయారీలో ఉపయోగిస్తారు. మొక్కలకు ఇది మంచి సేంద్రీయ పదార్థంగా పనిచేస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) విగ్రహాలను పొడి చేసి, వాటిని కొత్త ప్లాంటేషన్ కుండీలు (Plant Pots) లేదా నిర్మాణ పనులలో ముడిసరుకుగా ఉపయోగిస్తారు. పగిలిన గాజును కరిగించి కొత్త గాజు వస్తువులకు, లోహాలను (ఇత్తడి, రాగి) కరిగించి కొత్త పాత్రలకు వాడుతారు.కొన్ని ఫొటోలకు రంగులు అద్ది, చిన్న చిన్న కళాకృతులుగా మారుస్తారు. ఇలా పునరుద్ధరించబడిన ఈ దేవుడి చిత్రాలను ఎవరికైతే కొత్తగా దేవుడి పటాలు కావాలనుకుంటారో (ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, చిన్న దేవాలయాలకు), వారికి ఉచితంగా లేదా అతి తక్కువ ధరకు అందిస్తారు. దీనివల్ల పాత ఫొటోలకు కొత్త ఇల్లు దొరుకుతుంది.

ఎంతోకాలంగా భక్తితో పూజ చేసిన ఫొటోలు ఇంట్లో ఉంచి ఆ తరువాత ఇష్టమొచ్చినట్ల పారేస్తారు. వాస్తవానికి ఇంట్లో ఫొటో అమర్చినప్పుడు ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. అంటే ఆ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. మరి ఆ ఫొటో తీసేసే సమయంలో ఎటువంటి పూజలు చేయరు. అందువల్ల మేం సేకరించిన ఫొటోలకు అర్చకులతో ‘ఉద్వాసన పూజ’ చేస్తామని బెంగళూరులోని ‘దివ్యధార’ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా నదీ పక్కన పడేసిన ఫొటోలు, కుంకుమ ప్యాకెట్ల కవర్లు నదిలో కలవడం వల్ల నీరు కలుషితం అవుతుంది. మేమే వీటిని సేకరించి కాలుష్యాన్ని తగ్గిస్తున్నాం అని చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ప్రారంభమైన దీనిని దేశ మంతటా విస్తరిస్తామని చెబుతున్నార.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News