Saturday, December 6, 2025

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వేసిన ఈ దండ గురించి తెలుసా?

2025 ఫిబ్రవరి 25న బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. స్థానిక నాయకులు ప్రధానిని ఒక దండతో సత్కరించారు. ఇది అచ్చం పాప్ కార్న్ లాగే కనిపిస్తుంది. కానీ ఇవి పాప్ కార్న్ కాదు. అంతేకాకుండా ఈ దండ వేస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో సంతోషిస్తున్నారు. ఇంతకీ ఈ దండ విశేషాలు ఏంటి?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తేదీతో 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. సాధారణంగా నేటి కాలంలో ఈ వయసు ఉన్నవారు విశ్రాంతి తీసుకుంటూ.. మొబైల్ చూస్తూ కనిపిస్తుంటారు. కానీ నరేంద్ర మోదీ మాత్రం ఎంతో పెద్ద బాధ్యతను నిర్వహిస్తున్నారు. అందుకు కారణం ఆయన ఆరోగ్యంగా ఉండడమే. అలా ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజు తినే ఆహారంలో మఖాన కచ్చితంగా ఉంటుంది. బీహార్ పర్యటనలో నరేంద్ర మోడీకి స్థానిక రాజకీయ నాయకులు ఈ మాఖన దండను వేశారు. అసలు ఏంటి ఈ మాఖన? నరేంద్ర మోడీకి ఎందుకు వేశారు?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజువారి ఆహార శైలి మిగతా వారి కంటే భిన్నంగా ఉంటుంది. ఆయన ప్రతిరోజు వేడి నీరు కచ్చితంగా తాగుతారు. ఉప్మా, కిచిడి, khadi వంటి ఆయిల్ లేని పదార్థాలు తీసుకుంటారు. అలాగే స్నాక్స్ విషయంలో మొరింగా ఆకులతో చేసిన పరాటా తింటూ ఉంటారు. Dhokla తీసుకుంటూ ఉంటారు. అయితే ఏడాదిలో 300 రోజులు ప్రధాని నరేంద్ర మోదీ ఆహారంలో మఖాన కచ్చితంగా ఉంటుంది. ఆయనకు ఈ పదార్థం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ దండ వేశారు.

అచ్చం పాప్కార్న్ వలె ఉండే makhana ఎంతో హెల్తీ కలిగిన ఆహార పదార్థం. ఇందులో కొవ్వు పదార్థం తక్కువగా ఉంటుంది. దీనిని స్నాక్స్ గా తీసుకోవడం వల్ల శరీరాన్ని తేలికగా ఉంచుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా కాకుండా ఉంటుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మఖాన మంచి ఆహారం. అలాగే ఇందులో కాల్షియం, మెగ్నీషియం వంటివి ఉండడంతో ఎముకలకు మంచి బలాన్ని ఇస్తాయి. ఫ్లావనోయిడ్స్ ఇతర జీవ కణాల పెరుగుదలకు ఇది ఉపయోగపడడంతో త్వరగా వృద్ధాప్యం రాకుండా ఉంటుంది. అందువల్ల ప్రధానమంత్రి దీనిని ప్రతిరోజూ తింటూ ఉంటారు.

బీహార్ రాష్ట్రంలో మఖాన అత్యధికంగా పండుతుంది. అంతేకాకుండా దేశ సరఫరా లో ఇది 80% వాటాను కలిగి ఉంది. మఖానాను ప్రిక్లి వాటర్ లిల్లీ అనే విత్తనాల నుంచి తయారు చేస్తారు. 2025 కేంద్ర బడ్జెట్లో బీహార్ లో ప్రత్యేకంగా మఖాన బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకోసమే ప్రధాని నరేంద్ర మోదీని ఇలా makhana దండతో సత్కరించారు.

Reed Also..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News