పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ ‘హరిహరవీరమల్లు’. ఈ చిత్రం జూలై 23 గురువారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2300 థియేటర్లలో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 900 స్క్రీన్స్ పై షో సాగుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రీమియం షో లు ప్రారంభం కావడంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. ఆ తరువాత రోజునుంచి ఇతర ప్రేక్షకులు సినిమాను చూశారు. పవన్ కల్యాణ్ పై సాధారణంగానే ఎవరికైనా క్రేజ్ ఉంటుంది. దీంతో చాలా రోజుల తరువాత రిలీజ్ అయిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు తరలివచ్చారు. మరి ఈ మూవీ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
హరిహరవీరమల్లు మొదటి రోజు భారతదేశంలో ప్రీమియం షోల ద్వారా రూ.12.7 కోట్లు వసూలయ్యాయి. థియేటర్ల కలెక్షన్లు దేశ వ్యాప్తంగా రూ.31.5 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇలా దేశ వ్యాప్తంగా ఈ మూవీ తొలిరోజు రూ.43.8 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ అంతకుముందు సినిమా భీమ్లా నాయక్ తొలగి రోజు రూ.37.15 కోట్లు సాధించగా.. వకీల్ సాబ్ తొలి రోజు రూ.40.10 కోటలు వసూలు చేసింది.
క్రిష్ తో పాటు జ్యోతి కృష్ణ కలిసి తీసిన ఈ మూవీ గురించి ప్రమోషన్లో భాగంగా పవన్ కల్యాన్ ముందే స్టోరీ తెలిపాడు. దీంతో ఇది హిస్తారికల్ చిత్రం కావడంతో చాల మంది దీనిని చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ సినిమాలో 18 నిమిషాల ఫైట్ ఆకట్టుకుంటుందని ప్రేక్షకులు తెలుపుతున్నారు.





