ప్రభాస్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ‘కల్కి ఏడీ 2898’ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఫస్ట్ డే నుంచే దీనికి పాజిటివ్ టాక్ వస్తుండడంతో సినిమాను చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. చాలా రోజుల తరువాత కల్కి పుణ్యామని థియేటర్లు కళకళలాడుతున్నాయి. విజువల్స్ తో పాటు బెస్ట్ ఎపిక్ సినిమాగా ఉండడంతో దీని కోసం ఫ్యాన్స్ రిపీట్ గా చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ మూవీ కేవలం హీరో, హీరోయిన్లు అని కాకుండా వివిధ పాత్రలను చేసి ఒక మహత్తర కావ్యంగా తీర్చి దిద్దారు. ఇందులో భాగంగా కొందరు నటులు తీసుకున్న రెమ్యూనరేషన్ పై ఆసక్తి చర్చ సాగుతోంది. వీరిలో విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతంటే?
కల్కి సినిమా అనగానే ఎక్కువగా ప్రభాస్, దిశా పటాని, దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, కమలాసన్ గురించి మాత్రమే చర్చించుకుంటున్నారు.కాన ఇందులో సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్లు కనిపించారు. ఆ విషయాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముందుగానే చెప్పకుండా ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. కల్కిలో వీరు మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఎస్ ఎస్ రాజమౌళి, రాంగోపాల్ వర్మ కూడా కనిపిస్తారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ కూడా అర్జునుడి పాత్రలో ఆకట్టుకుంటాడు.
విజయ్ దేవరకొండ అర్జున్ పాత్రలో కనిపించగానే ఫ్యాన్స్ ఉబ్బితబ్బైపోయారు. విజయ్ దేవరకొండ గురించి ముందుగానే లీక్ అయింది. అయితే అతడు ఏ పాత్రలో కనిపిస్తాడోననేది సస్పెన్ష్ గానే ఉండేది. అయితే ఒక్కసారిగా అర్జునుడి పాత్రలో చూడగానే అంతా షాక్ అయ్యారు. అయితే విజయ్ దేవరకొండ చివరగా 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఈ కాసేపు కనిపించడానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడోనన్న ఆసక్తి చర్చ సాగింది.
కానీ విజయ్ దేవరకొండ ఇందులో కనిపించడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. విజయ్ దేవరకొండ మాత్రమే కాదు గెస్ట్ రోల్స్ లో కనిపించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఎస్ ఎస్ రాజమౌళి, రాంగోపాల్ వర్మలు సైతం ఉచితంగానే ఈ సినిమా కోసం పనిచేసినట్లు సమాచారం. ఇక కల్కి మూవీ కోసం ప్రభాస్ రూ.80 కోట్లు తీసుకున్నారు. దీపికా పదుకునే, దిశా పటానీలు రూ.20 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఈ చిత్రం నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే.