పురుషుల కంటే మహిళలే ఎక్కువ కష్టపడతారని కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉంటారు.. పురుషులు ఫీల్డ్ లోకి వెళ్లి ఎంత కష్టపడినా..ఇంట్లో మహిళలు చేసే కష్టం కంటే తక్కువ అని కొందరు అంటారు. ఎందుకంటే వారు ఇంటిని శుభ్రం చేసే పనుల్లో ఎంతో శ్రమ పడతారు. వీటిలో పాత్రలు కడగడం చాలా కష్టమైనది. ఉదయం లేచిన వెంటనే మొదట చేసే పని పాత్రలను శుభ్రం చేయడం. అయితే కొందరు ఈ పని కష్టమైనప్పుడు పనిమనిషిని నియమించుకొని వీటిని శుభ్రం చేసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో పనిమనిషి అనుకున్న సమయానికి రాదు. దీంతో ఆ సమయంలో చాలా కష్టం అనిపిస్తుంది. అయితే పాత్రలు కడిగే మిషన్ ఇంట్లో ఉండడం వల్ల ఒక్కోసారి పనిమనిషి రాకున్నా.. లేదా అలసట అనిపించినప్పుడు దీని ద్వారా పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు.
ప్రస్తుత కాలంలో ప్రతి పని మిషన్ తోనే చేస్తున్నారు. లేటెస్ట్ గా డిష్ వాష్ మిషిన్ కూడా అలరిస్తోంది. ఇవి ఇప్పటికే విదేశాల్లో వాడుతున్నారు. కానీ మన దేశంలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అయితే ఈ డిష్ వాష్ ఎలా పనిచేస్తుంది? పాత్రలను ఎలా శుభ్రం చేస్తుంది? అని చాలామందికి సందేహం ఉంటుంది. కానీ మన ఊహించని విధంగా పాత్రలను మిషిన్ లో వేయడం వల్ల కొద్దిసేపటి తర్వాత అవి క్లీన్ గా అయిపోతాయి.
అయితే ఇది ఎలా చేస్తుందో చూడడానికి అవకాశం ఉండదు. కానీ ఓ వ్యక్తి తన కెమెరాను ఉపయోగించి డిష్ వాష్ మిషిన్ ఎలా పనిచేస్తుందో తెలియజేశాడు. ఈ కెమెరా లోపల మిషన్ పాత్రలు ఎలా శుభ్రం చేస్తుందో పూర్తిగా చూపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు కూడా చూడాలంటే ఈ కింద వీక్షించండి..