Tuesday, June 24, 2025

భారత్ పెరిగిపోతున్న DINK సంస్కృతి.. DINK Life ఎలా ఉంటుంది?

డింక్ సంస్కృతి.. ఈ పేరు కొత్తదిగా అనిపిస్తుంది. కానీ ఇది పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనదేశంలో ఈ సంస్కృతి పెరిగిపోతుంది. అభివృద్ధిలో వేగంగా కొత్త పుంతలు తొక్కుతున్న భారత్లో డింక్ సంస్కృతి పెరిగిపోవడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే ఇది సనాతన సంప్రదాయానికి విరుద్ధం అని కొందరు అంటుండగా.. మేము పర్యావరణానికి మేలు చేస్తున్నాం.. అని ‘డింక్’ జంటలు అంటున్నారు. డింక్ లైఫ్ వల్ల ఎంతో హ్యాపీగా ఉంటుందని, ఎలాంటి టెన్షన్ ఉండదని అంటున్నారు. అసలు ఈ డింక్ సంస్కృతి ఏంటి? ఎందుకు కొందరు జంటలు దీనినికోరుకుంటున్నారు?

DINK అంటే Dual Income No Kids. ఈ మీనింగ్ చూడగానే అర్థమైపోయింటుంది. అంటే భార్యభర్తులు ఇద్దరం సంపాదించాలి. అందుకోసం పిల్లలు వద్దు.. అని అర్థం. ఈ డింక్ సంస్కృతి భారత్ లో పెరిగిపోతుందడానికి కొన్ని ఆధారాలున్నాయి. ఎలా అంటే 1950లో సంతానోత్పత్తి రేటు 6.18 గా ఉంది. ఇది 1980లో 4.60కి తగ్గింది. 2021లో 1.91కి తగ్గింది అని లాన్సెట్ సంస్థ అంచనా వేసింది. ఒకప్పుడు ఒకరిద్దరు పిల్లలను కనడం ద్వారా కుటుంబ అవసరాలు తీరే అవకాశ లేదు.అంటేకాకుండా ఆ సమయంలో సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవడంతో చనిపోతారనే ఉద్దేశంతో ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు. కానీ ఆ తరువాత ఒకరు లేదా ఇద్దరు అనే సంస్కృతికి వచ్చింది. ప్రస్తుతం కొందరు ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే నేటి కాలం యువత ఎక్కువగా పెళ్లయిన వెంటనే డింక్ ను ఫాలో అవుతున్నారు. అంటే భార్యభర్తలు ఇద్దరు సంపాదించి ఆ ఆ తరువాత పిల్లల్ని కనాలనే ఉద్దేశంతో ఉన్నారు. కొందరు అసలు పిల్లల జోలికే వెళ్లకూడదని నిర్ణయంచుకుంటున్నారు.

కానీ కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం డింక్ సంస్కృతి వల్ల నష్టాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే భారత్ లో కుటుంబ వ్యవస్థకు ప్రధాన్యం ఇస్తుంటారు. కేవలం డబ్బు సంపాదించడానికి పిల్లల్ని కనకపోవడం వల్ల దేశంలో జనాభా తగ్గుతుంది. దీంతో శ్రామిక శక్తి పడిపోతుంది. సీనియర్ సిటీజన్ల సంఖ్య పెరిగి యువత తక్కువవుతుంది. దీంతో నైపుణ్యవంతులు కరువవుతూ ఉంటారు.

ఒక కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి విధుల్లో మునిగిన వారు ఇంటికి రాగానే పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంటారు. ఇది ఎంత డబ్బు పెట్టినా దొరకదు అని కొందరి అభిప్రాయం. అందువల్ల సనాతన సంస్కృతికి బీటలు వేయకుండా ఉండాలని అంటున్నారు. డబ్బు సరిపోకపోతే ఖర్చులు తగ్గించుకోవాలి లేదా ఇతర మార్గాలు ఆలోచించాలి. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అంటున్నారుు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News