Wednesday, February 5, 2025

వినాయక చవితి రోజు పొరపాటున చంద్రుడిని చూశారా? అయితే ఈ మంత్రం పఠించండి..

ఎలాంటి శుభకార్యం నిర్వహించినా ముందుగా వినాయకుడికే పూజ చేస్తారు. అలాంటి పూజ ఎదుర్కొన్న విఘ్నేశ్వరుడు వినాయక చవితి సందర్భంగా 10 రోజుల పాటు వైభవంగా పూజలందుకుంటాడు. ఈ సందర్భంగా ఊరూ, వాడా గణనాథుడు కొలువై భక్తులను ఆశీర్వదిస్తాడు. వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు పది రోజుల పాటు ఆయన సేవలో మునుగుతారు. కొందరు ఈ పదిరోజుల పాటు నిష్టతో ఉంటూ ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివుడి పెద్ద కుమారుడు అయిన గణనాథుడు అంటే అందరికీ ఇష్టమే. పార్వతి అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమారుడికి పూజలు నిర్వహిస్తున్నందున ఆ మాత చూపు కూడా అందరిపై ఉంటుంది. కానీ శివుడి దగ్గర ఉండే చంద్రునితో మాత్రం వినాయకుడికి విభేదం ఉంటుంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి రోజున చంద్రుడిని చూడొద్దని అంటారు. అసలు ఇలా ఎందుకు అంటారు. ఈ చరిత్ర ఏంటి?

ప్రతీ ఏడాది భాద్రపద మాసంలో చతుర్థి రోజున వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఏ శుభ కార్యంలోనైనా మొదటి పూజ అందుకునే వినాయకుడికి ఇదే రోజు మొదటి పూజ చేయాలని చాలా మంది అనుకుంటారు. అందుకోసం ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే వినాయకుడి మొదటి పూజలో పాల్గొనాలంటే కొన్ని నియమాలు పాటించాలి. వినాయకుడి పూజ పూర్తయ్యే వరకు నిష్టతో ఉండాలి. శుచి, శుభ్రతతో మెలగాలి. ఇదే సమయంలో వినాయకుడికి ఇష్టంలేని చంద్రుడిని చూడొద్దు..

కొన్ని పురాణాల ప్రకారం.. వినాయకుడి ని చూసి చంద్రుడు నవ్వాడట. వినాయకుడికి పిండి వంటలు అంటే చాలా ఇష్టం. దీంతో ఆయనకు సమర్పించిన ప్రసాదాలను సేవిస్తాడు. అయితే పొట్ట బాగా నిండిన ఆయన ఇంటికి చేరుకుంటాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు నమస్కరించే సమయంలో కిందికి వంగలేక అవస్థలు పడుతారు. దీంతో పొట్ట పగిలి కుడుములు బయటకు వస్తాయి. ఇది చూసిన చంద్రుడు పకపకా నవ్వుతాడు. అయితే తనను చూసి హేళనగా నవ్విన చంద్రుడిపై గణేశుడికి కోపం వస్తుంది. దీంతో ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారికి నీలాప నిందలు తప్పవని శపిస్తాడు. అయితే దేవతలంతా కలిసి వినాయకుడిని వేడుకొంటారు. దీంతో భాద్రపద చతుర్థి రోజు మాత్రం చంద్రుడిని చూడొద్దని, ఆరోజు చూస్తే వారికి నిందలు తప్పవని అంటారు.

మరో పురాణం ప్రకారం.. వినాయక చవితి రోజు పొరపాటు కృష్ణుడు చంద్రుడిని చూస్తాడు. అయితే విలువైన శమంతకమణిని దొంగిలించాడనే నిందను కృష్ణుడు ఎదుర్కొంటాడు. దీంతో నారద మహర్షి కృష్ణుడితో.. మీరు వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినందునే ఈ నిందను ఎదుర్కొన్నారని చెబుతాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు గణేష చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించి ఆ నింద నుంచి విముక్తి పొందుతాడు.

వినాయక చవితి ఈ ఏడాది సెప్టెంబర్ 7న ఉదయం 9.29 గంటల నుంచి రాత్రి 8.44 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడిని చూడొద్దని కొందరు ఆధ్యాత్మి వాదులు పేర్కొంటున్నారు. అయితే పొరపాటున చంద్రుడిని చూస్తే ‘సింగ్ ప్రసేనాంవధిత్సింహో జాంబవత హత:’ సుకుమకారాక్ మరోదిస్తవ హ్యేష స్యమంతక:’ అనే మంత్రాన్ని జపించాలని కొందరు పండితులు చెబుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News