భారతదేశంలోఉన్న జంతువుల్లో మేకలు సాధు జంతువులు. వీటి వల్ల పాలు, మాంసం లభిస్తాయి. అంతేకాకుండా మేకల పెంపకం ఉపాధిగా కూడా ఉంటుంది. దేశంలో వివిధ రకాల మేక జాతులు ఉన్నాయి. ఆయా ప్రాంతం, వాతావరణాన్ని బట్టి ఇవి ఆరోగ్యంగా జీవించగలుగుతాయి. వీటిలో జమ్నాపరి మేకను ‘మేకల రాణి’గా పిలుస్తారు. ఇది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎక్కవగా కనిపించేవి ‘ఉస్మానాబడి’ మేకలు. ఇవి నల్లగా ఉంటాయి. వీటిని ఎక్కువగా పాల కోసం కాకుండా మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. అయితే ఓ మేకను ‘ప్రపంచపు రాణి’ గా పిలుస్తున్నారు. ఇంతకీ ఆ మేక విషేషాలేంటో తెలుసా?

ప్రపచంలో ఎన్నో రకాల మేక జాతులు ఉన్నాయి. కానీ సానెన్ మేక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనిని ప్రపంచపు రాణి అని పేర్కొంటారు. ఎందుకంటే ఇది మాంసం కోసం కాకుండా పాలు ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. సాధారణ మేకలు రోజుకు 2 లీటర్ల పాలు ఇవ్వొచ్చు. కానీ ఇవి 6 లీటర్ల వరకు పాలను ఇస్తాయని ఓ ప్రముఖ ఛానెల్ బీబీసీలో పేర్కొన్నారు. ఈఛానెల్ లో పేర్కొన్న కథనం ప్రకారం.. ఇటీవల పాకిస్తాన్ లోని ఈ మేకలు దిగుమతి చేసుకొని ఉపాధిని పొందుతున్నారు. అంటే మంచి ఆవు రోజుకు 4 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. అంతకంటే ఎక్కువ అని వీటిని బట్టి తెలుస్తోంది. అంతేకాకుండా సానెన్ మేకు ఏడాది పోడవునా పాలు ఇస్తాయి.సానెన్ మేక ద్వాారా ఉపాధి పొందాలంటే చల్లని వాతావరణం ఉండాలి. ఎందుకంటే ఇవి స్విట్జర్లాండ్ చేశానికి చెందిన మేకలు. ఆ దేశంలోని పర్వత ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

ప్రొఫెసర్ యూకె అథెయా తెలిపిన ప్రకారం.. సానెన్ మేకలు ఎక్కువగా తెలుపు రంగులో కనిపిస్తాయి. ఇవి 65 నుంచి 70 కిలోల వరకు ఉంటాయి. వీటి మెడ పొడవుగా ఉంటుంది. చెవులు పైకి ఉంటాయి. ఇది రోజుకు 3.8 లీటర్ల పాలు ఇస్తుంది. దీని పొదుగు చాలా పెద్దదిగా ఉంటుంది. పొదుగుపై మచ్చలు ఉంటాయి. ఈ మేరకు సంవత్సరానికి ఒకసారి పిల్లలను కంటుంది. ఒకసారి ఒకటి లేదా జత పిల్లలనకు జన్మనిస్తుంది. ఈ మేక నుంచి వచ్చే పాలలో 3.5 శాతం కొవ్వు, 2.5 శాతం ప్రోటీన్ ఉంటుది. అయితే ఈ మేక మంచి పాల ఉత్పత్తి ఇవ్వాలంటే అనువైన వాతావరణం ఉండాలి. వీటికి ఎక్కువగా నీడ ఉంచాలి. ఎండలో ఉండడం వల్ల తట్టుకోలేవు. వెంటిలేషన్ కల్పిస్తూనే.. చల్లని ప్రదేశం కల్పించాలి. అంతేకాకుండా వీటికి పోషకాలు కలిగిన ఫీడింగ్ ను అందించాలి.