పానీ పూరిని చూడగానే కొందరికి నోరూరుతుంది. అమ్మాయిలు దీనిని చూడగానే లొట్టలేసుకొని మరీ తింటారు. అయితే పానీ పూరి విక్రయించే ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల ఇక్కడ పానీ పూరి తింటే అనేక వ్యాధులు వస్తాయని ఇప్పటికే ప్రచారం జరిగింది. కానీ కొందరు దీనిని వదలకుండా తింటారు. అలాగే ఇటీవల షవర్మా బాగా ఫేమస్ అవుతోంది. దీని టేస్ట్ వేరే లెవల్లో ఉంటుంది. అయితే ఈరెండు పదార్థాలపై కొందరు ఫిర్యాదు చేయగా.. FSSAI నమూనాలు సేకరించి పరీక్షించింది. దీంతో వీటిలో ప్రాణాంతక బ్యాక్టరియాలు ఉన్నట్లు కనుగింది. ఇంతకీ FSSAI నివేదికలో ఏముందంటే?
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగర్ లో జనం రద్దీ ఎక్కుగా ఉంటుంది. ఇది ఐటీ సెక్టార్ కావడం వల్ల స్ట్రీట్ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడుతారు. ఈ క్రమంలో కొందరు పానీ పూరిని ఇష్టంగా తింటారు. అయితే పానీ పూరి విక్రయాలపై అనేక మంది Food Safety And Standards Authority Of India (FSSAI)కి అనేక మంది ఫిర్యాదులు చేశారు. దీంతో FSSAI అధికారులు కర్ణాటక రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి నమూనాలు సేకరించారు. వీటీలో బెంగుళూరు నగరంలో ఉన్న కొన్ని రెస్టారెంట్లు ఆరోగ్యానికి హానికంగా ఉన్నట్లు బయటపెట్టాయి.
FSSAI అధికారులు మొత్తం సేకరించిన 17 శాంపిల్స్ లో 8 అపరిశుభ్రంగా ఉన్నట్లు తేల్చారు. గత వారంలో FSSAI అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం పానీ పూరీ శాంపిల్స్ ను సేకరించారు. వీటిలో ఏమాత్రం ఆరోగ్యకరమైన పదార్థాలు లేవని గుర్తించారు. పానీ పూరితో పాటు షవర్మా శాంపిల్స్ సేకరించి పరిశీలించిన తరువాత వీటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటక వ్యాప్తంగా కృత్రిమ ఆహారం రంగులను నిషేధించిన తరువాత ఈ పరిశోధనలు నిర్వహించారు. వీటిలో 49 బెంగుళూరు నగరానికి చెందినవే ఉన్నట్లు గమనార్హం.
FSSAI ప్రకారం ఇలా నాణ్యత లేని ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే పానీ పూరీ, షవర్మాలో కొన్ని రంగులను ఉపయోగిస్తారు. వీటిని సౌందర్య సాధనాల్లో కూడా వినియోగిస్తుంటారు. ఇది పిల్లలకు తినిపించడం వల్ల తొందరగా అనారోగ్యానికి గురవుతారు. ఇవి తీసుకోవడం వల్ల వారిలో హైపర్యాక్టివిటీ సమస్యలు వస్తాయి. సన్ సెట్ ఎల్లో అనే సింథటిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయని తేల్చారు.