Saturday, December 6, 2025

ఈయన వ్యాపార ఐడియా సూపర్.. వీడియో వైరల్

బతికుంటే బజ్జీలైనా అమ్ముకోవచ్చని కొందరు అనుకుంటూ ఉంటారు. ఇది సామెత అయినా.. ఇటువంటి సంఘటనలు కొన్ని కనిపిస్తే ఆశ్చర్యమేస్తుంది. కొందరు సాంప్రదాయ వ్యాపారం కాకుండా కొత్తగా ఆలోచించి వినియోగదారులను ఇంప్రెస్ చేస్తారు. అంతేకాకుండా వారు అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు. ఒక్కోసారి మార్కెట్లో కొన్ని కూరగాయలు, పండ్లు అమ్ముడు పోకపోతే వాటిని పడేస్తారు. లేదా మరోసారి తక్కువగా అమ్ముతూ ఉంటారు. కానీ ఒక ఆయన మాత్రం అమ్ముడుపోని వాటిని వినూత్నంగా తయారు చేసి విక్రయిస్తూ ఉన్నాడు. ఇంతకీ అవేంటో తెలుసా?

వేసవికాలం రాగానే చాలామంది చల్లదనం కోరుకుంటూ ఉంటారు. శరీరానికి చల్లగా ఉండాలని తిని వాటిలో కీరదోస ఒకటి. అయితే కొందరు కీరదోసను నేరుగా తినడానికి ఇష్టపడరు. ముక్కలుగా కట్ చేసిన ఇది చాలా చక్కగా ఉండడంతో పట్టించుకోరు. అయితే ఇందులో కొంచెం సాల్ట్ వేసి తినేవారు ఉన్నారు. కానీ ఒక ఆయన మాత్రం కీరదోశను డిఫరెంట్ గా తయారుచేసి మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.

కీరదోసను మీది పొట్టు తీసేసి తింటూ ఉంటారు. కొందరు మొత్తం తినగలుగుతారు. అయితే ఒకయాన కీర దోశ మీది పొట్టును మాత్రం సేకరించి దానిని విక్రయిస్తున్నాడు. దీనిని రూ. ₹10 చొప్పున విక్రయిస్తున్నాడు. ఇందులో కాస్త ఉప్పు, కారం వేసి అందిస్తున్నాడు. ఈ మిశ్రమం తినడం వల్ల ఎంతో రుచిగా ఉందని కొందరు అంటున్నారు. అయితే చాలా మంది ఈ పొట్టును తీసేసి పడేస్తారు. కానీనీ దీనితో వ్యాపారం చేయడంపై అందరూ ఆశ్యర్యపోతున్నారు. వ్యాపారాన్ని ఇలా వినూత్నంగా విక్రయించడం వల్ల వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించవచ్చని ఈయనను చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో అందుబాటులో ఉంది. దీనిని ఇప్పటికే చాలామంది వీక్షించారు. కొంతమంది విపరీతంగా లైకులు కొడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News