Tuesday, June 24, 2025

నాని ‘ప్యారడైస్’ పై విమర్శలు.. ఎందుకంటే?

నాచురల్ స్టార్ నాని సినిమాలంటే కొందరికీ మహా క్రేజ్.ఈయన సినిమాలు కాస్త చూడ్డానికి బాగుంటాయని చాలా మంది అనుకుంటారు. ఫ్యామిలీ, కామెడీ, ఎమెషనల్ తో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని ఒక్కసారిగా తన స్టైల్ మార్చేశాడు. ‘దసరా’ మూవీ నుంచి ఈయన యాక్షన్ హీరో అనిపించుకుంటున్నాడు. అప్పటి నుంచి కాస్త భిన్నమైన సినిమాలు తీస్తున్నాడు. అయితే ఒక రకంగా ఇవి ఫ్యాన్స్ కు నచ్చుతున్నా.. ఆయన యాక్షన్ లో భాగంగా కొన్ని డైలాగ్ లు ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తున్నాయి. దసరా సినిమాలో ఓ డైలాగ్ పై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కానీ సినిమా హిట్టు కొట్టడంతో అవన్నీ మరిచిపోయారు.

తాజగా ఈ యంగ్ హీరో PARADISE మూవీతో వస్తున్న విషయం తెలిసింది. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై చురుకూరి సుధార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి డైరెక్టర్. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ దీనిని సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ మూవీ గ్లింప్స్, మ్యూజిక్, నాని డిఫరెంట్ లుక్ బాగానే ఉంది. కానీ ఆయన చేతిపై ఉన్న ఓ బూతు పదంపై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ గ్లింప్స్ సందర్భంగా తల్లిని కించపరిచే డైలాగ్ లు ఉన్నాయని కొందరు అంటున్నారు. ‘ఇది కడుపు మండిన కాకుల కథ…’ అంటూ అసభ్య కరంగా రాశారని అంటున్నారు. గతంలో సందీప్ వంగారెడ్డి తీసిన ‘అర్జున్ రెడ్డి’ మూవీలో ఇలాగే తల్లిని కించపరిచే డైలాగ్స్ ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు నాని ‘ప్యారడైస్’పై ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. అయితే వీటిపై నాని ఎలా స్పందిస్తారో చూడాలి…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News