Saturday, December 6, 2025

కామెడీ టూ సీరియస్.. వర్కౌట్ అవుతుందా?

వివిధ కారణాలతో బిజీ లైఫ్ ను గడిపేవారు రిలాక్స్ కావడానికి ఏకైక వేదిక సినిమా మాత్రమే. సినిమా చూడడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. వారం రోజుల పాటు ఉన్న టెన్సన్ అంతా పోతుంది. మరోసారి మైండ్ ను రీఛార్జ్ చేసినట్లు అవుతుంది. అయితే ఒక మంచి సినిమా మాత్రమే ఇలా చేయగలదు. కొన్ని సినిమా వల్ల మనసు ప్రశాంతం కాకపోగా..లేనిపోని తలనొప్పులు తయారవుతాయి. ముఖ్యంగా గతంలో ప్రేక్షకులకు ఎక్కువ వినోదాన్ని ఇవ్వడానికి కామెడీ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. ఆ తరువాత ఇప్పుడు కనిపించకుండాపోతున్నాయి. యాక్షన్ పేరిట వయలెన్స్ సినిమాలు వస్తూ మనసును పాడు చేస్తున్నాయి. కామెడీ కథలు కరువవుతున్న తరుణంలో కమెడియన్లు సైతం తమ రూట్ మార్చుకుంటున్నారు. మరి ఈ మార్పు వర్కౌట్ అవుతుందా?

ఒకప్పుడు ఒక సినిమాలో సునీల్ ఉన్నాడంటే ఆ సినిమాను తప్పకుండా చూసేవారు. కొన్ని సినిమాలు హీరోతో సమానంగా సునీల్ ఎక్కువ సమయం కనిపిస్తూ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. దీంతో అలనాటి దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం తరువాత సునీల్ మాత్రమే కామెడీ చేయగలడన్న పేరు వచ్చింది. కానీ ఆ తరువాత ‘అందాల రాముడు’ సినిమాతో సునీల్ జీవితం టర్న్ అయింది. అయితే ఆ సమయంలో తన జీవితం ఎక్కువగా కామెడీకే అంకితం అన్నారు సునీల్. కానీ రాను రాను క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా మారిపోయారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’తో సునీల్ విలన్ గా మారిపోయారు. అయితే సునీల్ నువిలన్ గా కొందరు మాత్రమే యాక్సెప్ట్ చేశారు. కానీ సునీల్ ఇప్పుడు ఏకంగా మలయాళంలోనూ ‘టర్బో’ మూవీతో విలన్ పాత్ర చేయనున్నారు. ఈ సినిమా హిట్టు, ఫట్టుతో సునీల్ కు సంబంధం లేకపోవచ్చు.. కానీ ఆ తరువాత విలన్ పాత్రలు వస్తాయంటారా? అంటే చెప్పలేం. కమెడియన్ గా ఉన్ననాళ్లు సునీల్ కు మంచి ఆఫర్లు వచ్చాయి. ఒక్కో సినిమాలో ఆయన చేసిన కామెడీతో ఆ సినిమా హిట్టు అయిన సందర్భాలు ఉన్నాయి. ‘ఒట్టేసి చెబుతున్నా..’, ‘ఖుషి ఖుషీగా’ ‘ఎలా చెప్పను’ వంటి సినిమాల్లో సునీల్ మార్క్ కనిపిస్తుంది. మరి ఇలాంటి సినిమాలు ఎందుకు రావు? ఇలాంటి పాత్రలు ఎందుకు చేయడం లేదు? అని కొందరు సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు.

ఇక కామెడీ స్టార్ హీరోగా అల్లరి నరేష్ సినిమా అంటే మెగాస్టార్ రేంజ్ లో ఊహించుకునేవాళ్లు. ‘కత్తి కాంతారావు’, ‘కిత్ కితలు’, ‘బెండు అప్పారావు’ సినిమాలు ఆయన కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ గా నిలిచాయి. అయితే ఇలాంటి సినిమాలు కావాలని కొందరు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. అప్పటి వరకు కొందరు యాక్షన్, మరికొందరు ఇతర విధాలుగా నటిస్తే వీరు మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు వీరు కూడా వయలెన్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇక కామెడీ కరువవుతుందని అంటున్నారు.

లేటేస్ట్ గా నరేష్ #N62 సినిమా పోస్టర్ రిలీజ్ అయింది. నరేష్ ఇది కాకుండా ఇప్పటి వరకు ఉగ్రం, నాంది వంటి యాక్షన్ సినిమాల్లో నటించారు. కానీ వర్కౌట్ కాలేదు. కానీ మరోసారి ఇదే యాక్షన్ సినిమా తీస్తున్నారు. అయితే ప్రేక్షకుల కోరిక మేరకు అన్నట్లుగా ఇటీవల ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా వచ్చింది. కానీ ఇది ఆకట్టుకోలేకపోయింది. అయితే కామెడీ సినిమాల కోసం ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న తరుణంలో ఓ వైపు యాక్షన్ సినిమాలు చేస్తూనే నవ్వించే సినిమాలు కూడా చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News