తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఇప్పటికే వివిధ పథకాల ద్వారా ఆకట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా డ్వాక్రా మహిళల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరికి ఈ గ్రూపు సభ్యుల్లో ఉన్న వారికి ఎలక్ట్రిక్ ఆటో ఇవ్వాలని చూస్తోది. ఇప్పటికే పాలకుర్తిలోని ఓ మహిళకు ఈవీ ఆటోను పంపిణీ చేశారు. ఆ తరువాత రాష్ట్రంలోని మహిళలకు వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళల కోసం ప్రత్యేకంగా పథకాలు ప్రకటిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కల్పించారు. ఆ తరువాత రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. ఇటీవల బతుకమ్మ చీరల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే దసరా నాటికి ఒక్కోక్కరికి నాణ్యమైన రెండు చీరలు అందించనున్నట్లు తెలిపారు. తాజాగా మహిళలకు ఉపాధి కోసం ఎలక్ట్రిక్ ఆటోను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఈ ఆటోను స్త్రీ నిధి రుణం ద్వారా కొనోగులు చేసి ఇస్తారు. ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సాధారణం కంటే ఈ వడ్డీ తక్కువగానే ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేసిన తరువాత ఛార్జింగ్ పాయింట్లు కచ్చితంగా అవసరం ఏర్పడుంది. ఈ నేపథ్యంలో వాటి కోసం అధికారులు అధ్యయం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ ఆటో ద్వారా మహిళలు అదనపు ఉపాది పొందేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ ఆటోలు రూ.1.12 లక్షల నుంచి రూ. 4.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇవి 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి. ఇప్పటి వరకు మార్కెట్లో Bajaj Re E Tec 9, Mahindra Trea Yaari, Piaggio Ape E city వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన ఆటోలు ఉన్నాయి. వీటిలో ఏ కంపెనీకి చెందిన ఆటోలు ఇస్తారోనన్న ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు ఈ సదుపాయం కల్పించడంతో ఆ గ్రూపు సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.