Sunday, December 7, 2025

దెబ్బకు దెబ్బ.. స్కామర్ నుంచే డబ్బులు దోచుకున్న యువకుడు..

ప్రస్తుత కాలంలో మొబైల్ కు కొత్త నెంబర్ నుంచి రింగ్ అయితే భయం వేస్తోంది. ఎక్కడ స్కామర్లు ఫోన్ చేస్తున్నారోనని.. లిప్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు. కానీ ఒక్కోసారి ఇవే ఇంపార్టెంట్ కాల్స్ అవుతున్నాయి. అయినా.. కొంత మంది స్కామర్లు అమాయకులను ఆసరాగా చేసుకొని వారికి తీవ్రంగా ఆర్థిక నష్టానికి గురి చేస్తున్నారు. అయితే పోలీసులు అవగాహనతో పాటు సోషల్ మీడియాలో ఈ స్కాం ల గురించి తీవ్రంగా చర్చ కావడంతో కొందరి యువకుల్లో చైతన్యం వస్తోంది. దీంతో కొందరు తమ తెలివితో స్కామర్లకు చుక్కలు చూపిస్తున్నారు. అలా ఓ యువకుడు సినిమాట్రిక్ లాగా Frad Call చేసిన వారికి చెమటలు పట్టించాడు. ఈ స్టోరీ ఆసక్తిగా ఉండడంతో పాటు భవిష్యత్ లో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుపుతుంది..

ఉత్తరప్రదేశ్ కు చెందిన భూపేంద్ర సింగ్ కు ఒక రోజు ఫోన్ రింగ్ అయింది. కొత్త నెంబర్ కావడంతో ఇతను కూడా అనుమానంతో ఫోన్ లిప్ట్ చేశాడు. ఆయన అనుకున్నట్లే అది ఫ్రాడ్ కాల్. అవతల నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూ భూపేందర్ సింగ్ ను భయపెట్టాడు. నేను సీబీఐ ఆఫీసర్ ను మాట్లాడుతున్నానని.. నీకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు తన వద్ద ఉన్నాయని, వాటిని బయటకు చెబితే నీ పరువు పోతుందని అన్నాడు. ఈ వీడియోలు మీ కుటుంబ సభ్యులకు పంపించకుండా ఉండడానికి రూ.16,000 పంపించాలని అడిగాడు. అయితే ఇది స్కామర్ కాల్ అని గ్రహించిన భూపేంద్ర సింగ్ తన తెలివిని ఉపయోగించి దయచేసి ఈ వీడియోల గురించి తన ఇంట్లో వారికి చెప్పవద్దని భయపడుతున్నట్లు నటించాడు.

భూపేంద్ర సింగ్ మళ్లీ అతనికి కాల్ చేసి తాను బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నానని.. ఆ బంగారం అమ్మి డబ్బులు ఇస్తానని, అది రావాలంటే రూ.3,000 చెల్లించాలని అన్నాడు. అయితే భూపేందర్ సింగ్ మాటలు నమ్మిన స్కామర్ వెంటనే ఆ రూ.3,000లను స్కామర్ భూపేందర్ సింగ్ కు ఫోన్ పే ద్వారా సెండ్ చేశాడు. ఆ తరువాత తన గోల్డ్ ఇవ్వడానికి షరతులు పెడుతున్నారని, అర్జంట్ గా కావాలని చెప్పాలని.. అ ఫోన్ ను అక్కడున్న తన ఫ్రెండ్ కు ఇచ్చాడు. దీంతో తన ఫ్రెండ్ బంగారం షాపు యజమానిలా మాట్లాడుతూ మొత్తం డబ్బులు కట్టనిదే బంగారం ఇచ్చేది లేదని చెప్పాడు. అందుకు మరో రూ. 7,000 కావాలని చెప్పాడు. ఇది కూడా నమ్మిన స్కామర్ మరో రూ. 7,000 పంపించాడు. ఇలా స్కామర్ మొత్తం రూ.10,000లను భూపేంద్రసింగ్ కు పంపించాడు.

ఆ తరువాత భూపేందర్ సింగ్ పోలీసుల వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు. దీంతో ఆ స్కామర్ అప్పటి నుంచి ఫోన్ చేయడం మానేశాడు. ఇలా ప్రతి ఒక్కరూ ఫ్రాడ్ కాల్ విషయంలో తమ తెలివిని ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు . అయితే అందరి విషయాల్లోనూ ఇలా జరగకపోవచ్చు. కానీ తమకున్న పరిస్థితులను భట్టి స్కామర్ల నుంచి తప్పించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్కామర్లకే బురిడీ కొట్టించిన భూపేందర్ సింగ్ కు సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News