Saturday, February 14, 2026

కరీంనగర్ మేయర్ పీఠానికి బీజేపీకి లైన్ క్లియర్.. పార్టీలో ఇద్దరు చేరిక

కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. మొత్తం 66 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో Bharatiya Janata Party మ్యాజిక్ ఫిగర్ దాటే దిశగా ముందంజ వేసింది. సొంతంగా 30 డివిజన్లలో విజయం సాధించిన బీజేపీకి మరో ఇద్దరు కార్పొరేటర్ల బలం అదనంగా చేకూరంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవానికి మార్గం సుగమనం అయింది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగిరినట్లయింది.

శుక్రవారం వెలువడిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలిలాల్లో భారతీయ జనతా పార్టీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 13 మంది గెలిచారు. అయితే కరీంనగర్ కార్పొరేషన్ లో మేయర్ పీఠం దక్కాలంటే ఆయా పార్టీకి వచ్చిన 50 శాతానికి పైగా ఓట్లు ఉండాలి. అంటే కనీసం 33 సీట్లు సాధించి ఉండాలి. కానీ ఫలితాల్లో బీజేపీ 30 సీట్లు మాత్రమే సాధించింది. అయితే ఎక్స్ అఫిషియో ఓట్లలో భాగంగా ఎంపీగా బండి సంజయ్, ఎమ్మెల్సీలుగా అంజిరెడ్డి, మల్క కొమురయ్యలు వేయొచ్చు. కానీ అంతకంటే ముందే కరీంనగర్లోని 13వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన తెల్ల లక్ష్మీ, అలాగే All India Forward Bloc తరఫున విజయం సాధించిన విపల సాయి జ్యోతి బీజేపీలో చేరారు. దీంతో ఈ ఇద్దరూ కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి విచ్చేసి కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపకి బలం 35కి చేేరింది. దీంతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి లైన్ క్లియర్ అయింది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కరీంనగర్ ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారని, కార్పొరేషన్‌ను పారదర్శక పాలనతో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. నగరాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, డ్రైనేజ్, రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారమే తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.

ఇక ప్రత్యర్థి పార్టీలలో అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. కొంతమంది కార్పొరేటర్లు కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మొత్తానికి కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ ఆధిపత్యం స్పష్టమవుతుండగా, మేయర్ ఎన్నికల ప్రక్రియపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. నగర రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News