Thursday, June 26, 2025

Bigboss 8 session: బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన వీళ్ల బ్యాగ్రౌండ్ ఎంటో తెలుసా?

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ 8వ సీజన్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరా? అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియాలో ప్రసారం అయ్యాయి. కానీ ఫైనల్ గా హౌస్ లోకి అడుగుపెట్టేది ఎవరు? అనేది అధికారికంగా వెలువడే సమయం కోసం అందరూ ఎదురుచూశారు. అయితే ఇప్పటి వరకు ప్రసారమైన వాళ్లలో కాకుండా కొంత మంది అనుకోకుండా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో 7 జంటలు ఉన్నాయి. వీరిలో కంటెస్టెంట్లు ఎవురు? వారి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం..

బిగ్ బాస్ మొదటి కంటెస్టెంట్:
యష్మి: స్వాతి చినుకులు అనే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె కృష్ణ ముకుంద మురారి సినిమాతో ఫేమస్ అయింది. ఈమెకు సిరామిక్ పాత్రలు తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఉంది.

బిగ్ బాస్ రెండో కంటెస్టెంట్:
నిఖిల్: గోరింటాకు సీరియల్ తో ఫేమస్ అయ్యారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈయన 2016లో ‘ఊటీ’ అనే సినిమాలో నటంచారు. ఆ తరువా తెలుగులో ఊర్వవివో, రాక్షసివో సీరియల్ లో నటించారు.

బిగ్ బాస్ మూడో కంటెస్టెంట్:
అభయ్ నవీన్: తెలంగానలోని సిద్ధిపేటకు చెందిన నవీన్ ఇంజనీరియంగ్ పూర్తి కాగానే బ్యాంక్ ఉద్యోగం సంపాదించాడు. ఆ తరువాత సినిమాల్లో ట్రై చేయగా బొమ్మల రామారం అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు..

బిగ్ బాస్ నాలుగో కంటెస్టెంట్:
ప్రేరణ: బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన నాలుగో కంటెస్టెంట్ ప్రేరణ. ఈమె కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో ఫేమస్ అయింది. ఈ సీరియల్ లో నటించిన యష్మీ గౌడ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్ ఐదో కంటెస్టెంట్:
ఆదిత్య ఓం: ‘లాహిరి లాహిరి లాహిరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆదిత్య ఓం ఆ తరువత కొన్ని సినిమాల్లో నటించారు. కానీ సక్సెస్ కాకపోవడంతో హిందీలోకి వెళ్లి నటించారు.

బిగ్ బాస్ ఆరో కంటెస్టెంట్:
సోనియా: రాంగోపాల్ వర్మ తీసిన ‘దిశ’ సినిమాతో ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది.

బిగ్ బాస్ ఏడో కంటెస్టెంట్:
బెజవాడ బేబక్క: కరనా సమయంలో తన రీల్స్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తరువాత సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా హౌజ్ లోకి అడుగుపెట్టారు.

బిగ్ బాస్ ఎనిమిదో కంటెస్టెంట్:
శేఖర్ భాషా: రేడియో జాకీగా ఆకట్టుకున్న శేఖర్ భాషా ఆకట్టుకున్నాడు. 2005 నుంచి జెమినీ టీవీలో పనిచేస్తున్నాడు. హరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో శేఖర్ భాషా పేరు బాగా వినిపించింది.

బిగ్ బాస్ తొమ్మిదో కంటెస్టెంట్:
కిరాక్ సీత: యూట్యూబ్ లో పలు కంటెంట్ల ద్వారా ఫేమస్ అయిన కిర్రాక్ సీత ‘బేబీ’ సినిమాలో నటించింది. అయితే కొందరు బేబీ సినిమాలోలాగే ఆమె నిజ జీవితంలోనూ అలాగే ఉంటారంటూ ట్రోల్ చేశారు.

బిగ్ బాస్ పదో కంటెస్టెంట్:
నాగమణికంఠ: జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన నాగ మణికంఠ సీరియళ్ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు బిగ్ బాస సీజన్ లోకి అడుగుపెట్టాడు.

బిగ్ బాస్ పదకొండో కంటెస్టెంట్:
పృథ్వీరాజ్: నాగపంచమి సీరియల్ తో ఫేమస్ అయిన పృథ్వీరాజ్ అశేష అభిమానులు సంపాదించుకున్నాడు. అయితే సినిమాల్లోకి రావాలని చూస్తున్న తరుణంలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్ పన్నెండో కంటెస్టెంట్:
విష్ణుప్రియ: టీవీ యాంకర్ గా ఇప్పటికే ఫేమస్ అయిన విష్ణుప్రియ ‘జర్రీ జర్రీ’ సాంగ్ తో కుర్రాళ్ల ఫేమస్ నటిగా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.

బిగ్ బాస్ పదమూడో కంటెస్టెంట్:
నైనిక: డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన నైనిక ఢీ డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా మంచి పేరు తెచ్చుకుంది.

బిగ్ బాస్ పద్నాలుగో కంటెస్టెంట్:
నబీల్:వరంగల్ డైరీస్ యూట్యూబ్ ద్వారాఫేమస్ అయిన నబీల్ కు చిన్నప్పటి నుంచి నటుడు కావలన్న ఆకాంక్ష ఉండేది. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లకి వెళ్లే అవకాశం వచ్చింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News