Saturday, December 6, 2025

రాజకీయాల్లోకి వస్తున్నాడని.. పాలతో స్నానం.. నాణెలతో తూకం.. వీడియో..

మనం ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు నలుగురికి చెప్తాం.. దీంతో మన మంచి కోరుకునే చాలా మంది సపోర్టు చేస్తారు.. అంతేకాకుండా ఆ పని ప్రారంభించే సమయంలో స్వీట్స్ పంచుతాం.. అలాగే ఏదైనా యాత్రకు వెళ్లేటప్పుడు అంతా శుభం జరగాలని కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం.. అయితే సినిమా నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఘనంగా సభలు నిర్వహిస్తూ ఉంటారు. వారి అభిమానులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అయితే భోజ్ పురి కి చెందిన నటుడు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆ సమయంలో ఆయన అభిమానులు ఏం చేశారంటే?

Kesari Lal Yadav.. ఈయన భోజ్ పురి నటుడు. ఆయన ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించడం ఆసక్తిగా మారింది. బిహార్ లోని పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనతో భార్య చందా ఇద్దరూ అక్టోబర్ 2025లో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీలో చేరారు. ప్రముఖ నాయకుడైన తేజస్వి యాదవ్ ఆర్జేడీ పార్టీ అధినేత. మాజీ ముఖ్యమంత్రి, ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు లాలూ ప్రసాదయ్ యాదవ్ కుమారుడే తేజస్వి యాదవ్. కేసరి లాల్ యాదవ్ బిహార్ లోని ఛాప్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 24న నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన అభిమానులు అద్భుతమైన వేడుక నిర్వహించారు.

దాదాపు 200 నుండి 400 లీటర్ల పాలను డ్రమ్, బకెట్లలో తీసుకువచ్చి ఆయనకు పాలాభిషేకం చేశారు. ఈ పాలాభిషేకం ప్రత్యేకంగా ఫిలిం సీన్ లాగా మారిపోయింది. ఆయనపై ఉన్న అభిమానం ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది అని కొందరు కొనియాడారు. పాలాభిషేకం తర్వాత Kesari Lal Yadav కు 5 లక్షల రూపాయల విలువైన నాణెములతో తులాభారం నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kesari Lal Yadav జనవరి 15, 1986న పాట్నా జిల్లాలోని ఛాప్రా (Chhapra) లో జన్మించారు. ఆయన ఇంకా బిహార్ రాష్ట్రానికి చెందినవారు. తక్కువ ఆదాయం కలిగిన యాదవ కుటుంబంలో పెరిగిన ఆయన చిన్నప్పుడు ఇంటి ఆర్థిక స్థితి దెబ్బతినడం కారణంగా గోమేది, పాలు అమ్మడం, పాటలు పాడడం వంటి పనులు చేసి జీవితాన్ని ప్రారంభించారు. ఆయన కుటుంబంలో మొత్తం ఏడు సోదరులు ఉన్నారు. తండ్రి పని చన్ను అమ్మడం, చౌకీదారు కావడం. తల్లి లిట్టీ-చోఖా అమ్మడం ద్వారా కుటుంబాన్ని పోషించారు. ఆయన పదవ తరగతి వరకు చదువుకున్నారు.

Kesari Lal Yadav 2011లో సాజన్ చలే ససురాల్ అనే భోజ్పురీ చిత్రం ద్వారా తన ప్రవేశం చేశారు. ఆ తర్వాత సుమారు 70 భోజ్పురీ సినిమాల్లో నటించారు. 5000 కి పైగా పాటలు పాడారు. ఆయన నటించిన సినిమాల్లో సపూత్ (2012), లహూ కే దో రంగ్ (2013), సంసార్ (2013), నాగిన్ (2013) ప్రముఖమైనవి.

అయితే ఇప్పటి వరకు చాలా మంది భోజ్ పురి నటులు రాజకీయాల్లోకి వచ్చారు. వీరిలో రవికిషన్ గురించి మనకు తెలుసు. ఆయన రేసుగుర్రంలో విలన్ గా మెప్పించారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News