థియేటర్లలో దద్దరిల్లే డైలాగ్స్.. గూస్ బంప్స్ తెచ్చే ఎమోషన్స్.. నరాలు తెంపే ఫైట్స్.. ఇవన్నీ కలగలిపితే నందమూరి బాలకృష్ణ. సినీ ఇండస్ట్రీకి నేటి కాలంలో యంగ్ హీరోలు రావడం తక్కువైంది. కానీ బాలయ్య ఆ లోటును పూడుస్తున్నారు. కుర్రకారుకు ఫుల్ బిర్యానీ తినిపించే సినిమాలతో వస్తున్నారు. వారిలో ఎక్కడా లేని ఉత్సాహాన్ని తెప్పిస్తున్నారు. దీంతో బాలకృష్ణ సినిమా కోసం చూసే వారి సంఖ్య పెరిగిపోయింది. అఖండ నుంచి మొన్నటి భగవంత్ కేసరి వరకు బాలయ్య సినిమాలన్నీ హిట్టే. ఇవన్నీ మాసిజం సినిమాలు కావడం విశేషం. ఇప్పుడు మరో వీర(ఊర)మాస్ సినిమాతో వస్తున్నాడు. ఆ టీజర్ రిలీజైంది.
60 ప్లస్ లోనూ రేసుగుర్రం స్పీడులా నటిస్తున్న బాలయ్య ఎనర్జీని చూసి కుర్ర హీరోలు నోరెళ్లబెడుతున్నారు. సాధారణంగా ఈ వయసులో సిసిమాలో తీసే సీనియర్ హీరోలు కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. కానీ బాలయ్య మాత్రం ఎనర్జిటిక్ పవర్ తో వస్తున్నారు. దీంతో ఆయనతో సినిమా తీసేందుకు డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. భగవంత్ కేసరి సినిమా తరువాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా బాబీ సినిమాతో బిజీ అయ్యాడు. ఈ సినిమాకు వీర మాస్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో మేకింగ్ అవుతున్న సినిమా టీజర్ ను జూన్ 10న రిలీజ్ చేశారు. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఫ్యాన్స్ కు గిప్ట్ ఇచ్చారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ సౌమ్ముడిగా ఉన్న వీడియోను చూస్తాం. దీంతో పాటు తాజాగా బోయపాటి సినిమా ప్రకటించారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఫెయిలయింది లేదు. దీంతో మరోసారి ఈ జోడి జతకట్టడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ మూవీ ఊరమాస్ లెవల్లో ఉండనుందన్న చర్చ సాగుతోంది. ఈ సినిమాకు బాలయ్య కూతురు తేజస్విని నిర్మాతగా మారనున్నారు. తేజస్విని ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య కాల్ షీట్లు ప్రస్తుతం తనే చూసుకుంటున్నారు. ఇప్పుడు నేరుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.