ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నందమూరి కుటుంబం ఎక్కువ సీట్లు గెలుచుకుంది. వీరిలో ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణకు బంధువులుగా ఉన్న వారంతా గెలిచారు. 2024లో ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసకున్నారు. ఆయన బావ, వియ్యంకుడు చంద్రబాబు నాయుడు తొమ్మిదోసారి కుప్పం నుంచి గెలుపొందారు. బాలకృష్ణ పెద్ద అల్లుడు, చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మంగళగిరి నుంచి గెలుపొందరు. బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ విశాఖ ఎంపీగా గెలుపొందారు. ఎన్టీఆర్ కుమార్తె, బాలకృష్ణ అక్క పురంధేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీగా గెలుపొందారు. ఇలా ఎన్టీఆర్ వారసులుగా రాజకీయాల్లో కొనసాగుతున్న వారంతా గెలవడం విశేషం.