బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. మంగళవారం కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ,సీబీఐ కేసుల దర్యాప్తు పూర్తయిందని దీంతో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని, అందువల్ల బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు మహిళా కోణంలో ఆలోచించి ఈ బెయిల్ మంజూచేస్తున్నట్లు తెలిపింది. జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణను చేపట్టగా.. కవిత తరుపున ముకుల్ రోహత్గీ, ఈడీ నుంచి ఏఎస్ వాదనలు వినిపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 5 నెలలో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉంటున్నారు. లిక్కర్ స్కాం కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ అధికారులు ఆమెను మార్చి 15న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం ఢిల్లీ కోర్టు, రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే అయితే తనకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ అధికారులు కోరుతూ వస్తున్నారు. అయితే జూలై 16న కవిత అస్వస్థకు గురయ్యారు. ఆగస్టు 22న మరోసారి అస్వస్థతకు గురి కావడంతో ఎయిమ్స్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అదే రోజు మధ్యాహ్నం తిరిగి జైలుకు పంపించారు.
అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీడీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టు, హైకోర్టును కవిత ఆశ్రయించారు. అయితే ఈ బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గత విచారణలో కవిత బెయిల్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా కౌంటర్ చేసేందుకు ఎందుకు ఆలస్యం అయిందని ప్రశ్నించింది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. కవిత తరుపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాకు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యాయి.
అయితే కవిత సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కేటీఆర్ తో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఢిల్లీకి వచ్చారు