Sunday, December 7, 2025

‘ఆపరేషన్ సింధూర్’లో పదేళ్ల బాలుడి సాయం.. సైన్యం సన్మానం..

భారతదేశ రక్షణకు రాత్రనక.. పగలనక కష్టపడుతూ ఉంటారు. నిద్రాహారాలు మాని దేశాన్ని కాపాడతూ ఉంటారు. ఇంత చేసిన వారికి ఏమిచ్చినా తక్కువే అనిపిస్తుంది. అయితే వారికి సపోర్టుగా నిలిస్తే చాలని సైన్యం అనుకుంటుంది. అలాంటి సపోర్టు ఇవ్వడానికి కూడా కొందరు ముందుకు రారు. కానీ పదేళ్ల వయసు ఉన్న ఓ బాలుడు భారత సైన్యానికి అండగా నిలిచాడు. ఇందుకు గాను వారు ఇటీవల బాలుడికి సన్మానం చేశారు. ఇంతకీ ఇంత చిన్న వయసులో ఆ బాలుడు సైన్యానికి ఏ విధంగా సహాయం చేశాడు? అసలేంటీ కథ?

ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. దీనికే ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టారు. ఈ క్రమంలో భారత్, పాక్ మధ్య బాంబుల వర్షం కూడా కురిసింది. ఇలాంటి సమయంలో యుద్ధం జరిగే ప్రాంతంలో ప్రజలు భిక్కు భిక్కుమంటూ గడిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో కొనసాగారు. కానీ ఈ సమయంలో కూడా ఓ బాలుడు ప్రాణాలకు తెగించి భారత సైన్యానికి సాయం చేశారు. వారికి కావాల్సిన వస్తువులు అందించారు.

మనం చిన్న ఉద్యోగం చేస్తే.. కాస్త తలనొప్పిగా ఉంటే వెంటనే టీ తాగతూ ఉంటాం. కానీ యుద్ధంలో పాల్గొనే సైనికులకు ఆహారం ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో టీ కావాలంటే దొరుకుతుందా? కానీ శ్రవణ్ కుమార్ సింగ్ అనే బాలుడు భారత సౌన్యానికి ఉడతా సాయంగా.. టీ, పాలు, ఇతర ద్రవ పదార్థాలను అందించాడు. భారతదేశ తీరంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో తారావాలీ అనే గ్రామం ఉంది. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో భాగంగా ఈ గ్రామంలో భారీగా సైన్యం మోహరించింది. ఇక్కడున్న సైనికులకు గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ టీ, పాలతో పాటు ఇతర ఆహార పదార్థాలను అందించి వారి మనసును గెలుచుకున్నాడు. ఇలాంటి సమయంలో కేవలం బయటకు రావాలంటేనే చాలా మంది భయపడేవారు. కానీ ఈ బాలుడు ప్రాణాలకు తెగించి సైనికులకు ఆహార పదార్థాలను అందించాడు.

అయితే ప్రస్తుతం యుద్ధం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత సైన్యం ఆ బాలుడిని సత్కరించింది. భారత రక్షణ కోసం నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినా.. యుద్ధం చేస్తున్న వారికి సాయం చేయడం కూడా యుద్ధంలో పాల్గొనడమే అని అంటారు కొందరు. అలా ఈ బాలుడు చిన్న వయసులోనే భారత యుద్ధంలో పాల్గొన్నాడని కొందరు సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. మిగతావారు కూడా బాలుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News