Tuesday, June 24, 2025

మీ పిల్లలు లేజీగా ఉంటున్నారా? తెలివైన వారు కావాలని అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..

కొందరు చిన్న పిల్లలను చూస్తే చాలా ఆసక్తిగా ఉంటారు. వారు వయసుకు మించి తెలివితేటలు ఉంటాయి. ప్రపంచంలో జరిగే విషయాలు చెబుతూ ఉంటారు. ఒక్కసారి ఏదైనా విషయం చెబితే వెంటనే పట్టేసుకుంటారు. మరికొందరు మాత్రం లేజీగా ఉంటారు. ఏ పని చెప్పినా పట్టించుకోరు. అలాంటి వారిని చూసి తల్లిదండ్రు చాలా కోప్పడుతారు. వారిని నిందిస్తూ వారితే తప్పన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ తెలివైన పిల్లలుగా మారాలంటే ఇలా చేయాలి..

  • పిల్లలకు కనీసం 5 ఏళ్ల వయసు పైబడిన తరువాత బయటకు తీసుకెళ్తూ ఉండాలి. సమాజంలో జరిగే పరిస్థితులను వారికి అర్థమయ్యే విధంగా వివరంచాలి. అనేక విషయాలపై స్వతంత్రంగా ఆలోచించే విధంగా స్వేచ్ఛను ఇవ్వాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చూడాలి.
  • నేటి కాలంలో పిల్లలు ఎక్కువ శాతం మొబైల్స్ చూస్తున్నారు. అవి కాకుండా వారికి మంచి పుస్తకాలు కొనివ్వండి. చదవడం ఇష్టం లేకపోతే డ్రాయింగ్ కోసం సదుపాయాలు కల్పించాలి. వీలైతే న్యూస్ పేపర్ చదివేలా అలవాటు చేయాలి.
  • పిల్లల్లో చాలా మంది ఉదయం లేవడానికి ఇష్టపడరు. ఇదిలాగే కొనసాగితే వారిలో బద్ధకం ఏర్పడుతుంది. అలా కాకుండా వారికి ఉదయం 5 నుంచి 6 గంటల లోపు మాత్రమే నిద్ర లేపాలి. ఈ సమయంలో వారు లేచి కొద్దిపాటి వ్యాయామం చేసినా వారిలో ఉత్సాహం ఉంటుంది. శారీరకంగా యాక్టివ్ గా ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.
  • కొత్త విషయాలు తెలుసుకోవాలని చాలా మంది పిల్లలకు ఆసక్తి ఉంటుంది. తల్లిదండ్రులు కాస్త ఓపిక తెచ్చుకొని వారు అడిగిన సందేహాలను తీర్చే విధంగా చూడాలి. లేకుండా వారు కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపించరు..
  • పిల్లలు యాక్టివ్ గా ఉండాలంటే వారికి సరైన ఆహారం అందించాలి. విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజాలు ఉండే పదార్థాలను తినిపిస్తూ ఉండాలి. పాలు, గుడ్లు తప్పనిసరిగా ప్రతిరోజూ ఇవ్వాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News