Tuesday, June 24, 2025

అక్షయ తృతీయ రోజు బంగారం కొంటున్నారా? నకిలీదో.. అసలైందో ఇలా రహస్యంగా తెలుసుకోండి..

హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని పండుగలు, పర్వదినాల రోజు కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. పర్వదినాల్లో భాగంగా అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా భావిస్తాం. ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజు. అందువల్ల ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించేందుకు లక్ష్మీదేవికి ప్రతిరూపమైన బంగారంను కొనుగోలు చేయాలని అనుకుంటారు. అయితే మార్కెట్లో సర్వం కల్తీమయంగా మారింది. ఈ నేపథ్యంలో బంగారం కూడా నకిలీది కూడా ఉండే అవకాశం ఉంది. మరి నకిలీ బంగారాన్ని గుర్తించడం ఎలా?

బంగారం ఎలాగూ పసుపు రంగులో ఉంటుంది. కాబట్టి.. ఈ రంగులో ఉండే ప్రతీ లోహం బంగారం అని అనుకోవద్దు. ఎందుకంటే అక్రమంగా డబ్బులు సంపాదించడానికి కొందరు నకిలీ బంగారాన్ని కూడా విక్రయిస్తూ ఉంటారు. మన దేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ ఇస్తుంది. నిజమైన బంగారం ఆభరణాలపై దీని లోగో ఉంటుంది. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది 22 క్యారెట్ల పై 916.. 18 క్యారెట్లపై 750 నెంబర్ ఉంటుంది. అంటే ఈ నెంబరు ఉన్న బంగారం స్వచ్ఛమైనది అని తెలుసుకోవచ్చు.

అయినా బంగారం నకిలీదో కాదో మరో రకంగా కూడా టెస్టు చేసుకోవచ్చు.

ఆభరణాల అంచులు రంగు మారితే అది పూత పూసిన బంగారమని గుర్తించాలి.

అలాగే బంగారంతో ఇతర లోహాలను పక్కన ఉంచడం వల్ల బంగారం రంగు మారుతుంది.

బంగారానికి అయస్కాంత లక్షణాలు ఉండవు. ఏదైనా ఐస్కాంతాన్ని బంగారం వద్ద ఉంచితే దానిని ఆకర్షిస్తే అది నిజమైన బంగారం కాదని గుర్తించాలి.

బంగారు ఆభరణాన్ని ఒక గిన్నెలో వేయాలి. ఇది స్వచ్ఛమైనది అయితే వెంటనే మునిగిపోతుంది. అయితే నెమ్మదిగా మునిగితే అది నకిలీదిఅని గుర్తుంచుకోవాలి.

నిజమైన బంగారాన్ని వేడి చేస్తే ఎటు వీలైతే అటు వంగిపోతుంది.

కానీ నకిలీ బంగారం ఎంత వేడికి గురైన ఎలాంటి మార్పులు ఉండదు.

కొందరు బంగారంలో ఇరిడిన్ కలుపుతారు. ఇలాంటి బంగారంను వాడడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. అందువల్ల స్వర్ణకారుల వద్ద తయారుచేసిన బంగారాన్ని వాడాలని కొందరు చెబుతున్నారు. అయితే జువెలరీ షాపులో కొనుగోలు చేసిన పై రకంగా టెస్ట్ చేసిన తర్వాత కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News