Wednesday, June 25, 2025

AP Politics: ప్రమాణ స్వీకార వేదికపై చిరంజీవితో పవన్ కల్యాణ్ ఆత్మీయ ఆలింగనం.. వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొణిెదెల పవన్ కల్యాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని పొందారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అందరికీ నమస్కరించారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న అన్న మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు మొక్కారు.

సినీ ఇండస్ట్రీలోకి పవన్ రావడానికి మెగాస్టార్ చిరంజీవినే కారణం. ఇటు రాజకీయాల్లోకి అన్న బాటలోనే పవన్ వచ్చారు. 2006లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పవన్ కల్యాణ్ యూత్ అధ్యక్షుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతుగా ప్రచారం చేశారు.

ఇక పవన్ , చిరంజీవి ఆలింగనం చేేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News