టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపిన రాజ్ తరుణ్ వ్యవహారంలో మరో హాట్ న్యూస్ సంచలనంగా మారింది. సినీ నటుడు రాజ్ తరుణ్ తనతో స్నేహంగా ఉండి, తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే రాజ్ తరుణ్ తో మరో నటి మాల్వీ మల్హోత్రా తో సంబంధం ఏర్పరుచుకున్నాడని, ఆమెతోనే స్నేహంగా ఉండి తనను పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఈ విషయంపై రాజ్ తరుణ్ స్పందించించిన విషయం తెలిసిందే. అయితే లేటేస్ట్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్హోత్రా సైతం రంగంలోకి దిగింది. తనకు, రాజ్ తరుణ్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
రాజ్ తరుణ్ తనకు తోటి నటుడు మాత్రమేనని, లావణ్య చెప్పేవన్నీ అబద్దాలే అని తెలిపారు. గత ఆరు నెలలుగా అసలు రాజ్ తరుణ్ తో టచ్ లో లేనని, రీసెంట్ గా సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే మాట్లాడడని తెలిపింది. ఈ సమయంలోనే తనను లావణ్య అవమానిస్తుందని తెలిపారు. అంతేకాకండా తనకు మెసేజ్ లు, కాల్స్ చేసి టార్చర్ చేస్తోందని అన్నారు. ఆమె తల్లిదండ్రులు కూడా తనకు ఫోన్ చేస్తున్నారని వాపోయింది. తన కుటుంబ సభ్యులు లావణ్యను బెదిరించలేదని, ఆమె చెప్పేవన్నీ అబద్ధాలేనని పేర్కొంది. తన కుటుంబ పరువు తీస్తున్నందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.