తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ పుణ్య క్షేత్రాన్ని సందర్శించారు. ఈ ఆలయంలో ధర్మ గుండ వద్ద రూ.76 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలోని రాజన్న స్వామిని దర్శించుకున్నారు. వేములవాడకు సీఎం పర్యటన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా మంత్రి పొన్నం ఆసక్తికర కామెంట్స్ చేశారు..
వేములవాడ సీఎం పర్యటన సందర్భంగా ఆయనకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఆయనకు బోకేలు ఇచ్చి వెల్ కం చెప్పారు. ఇదే సమయంలో మంత్రులకు సైతం ఘనంగా స్వాగతం చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అధికారులు సైతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అధికారులు వెల్ కం చెప్పారు. అయితే స్వాగతం పలికి అధికారుల్లో ఆయన భార్య కూడా ఉండడం విశేషం.
దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా మంత్రి శ్రీధర్ బాబు భార్య శైలజా రామయ్యర్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మినిస్టర్ అయిన శ్రీదర్ బాబు, తన భర్తకు పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అయితే అక్కడే ఉన్న మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ‘అన్న.. వదిన… ఫొటో బాగా తీయండి.. ’ అంటూ నవ్వులూ పూయించారు.