టాలీవుడ్ స్టార్ నటి అనసూయ నిత్యం సోషల్ మీడియాతో తన పర్సనల్ విషయాలను పంచుకుంటూ ఉంటుంది. లేటేస్టుగా ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్ వేసింది. భర్త భరద్వాజ్, ఇద్దరు కుమారులతో కలిసి జలకాలాడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ను అనసూయ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఓ అందమైన జలపాతం వద్ద కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్స్ యూత్ ను బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ సందర్భంగా అనసూయ తన పిక్స్ ను షేర్ చేసింది.
![Anasuya Bharadwaj](https://insightearth.in/wp-content/uploads/2024/05/Anasuya-Bharadwaj.jpg)
ఈ సందర్భంగా అనసూయ తన ఫొటోలకు క్యాప్షన్ పెట్టింది. ‘అందమైన మౌంటైన్ ఫారెస్ట్ ఫాల్ లో సంతోషంగా గడిపాం’ అని రాశారు. ఈ క్యాప్షన్ కింద ‘వాటర్ బేబ్ ఫర్ లైఫ్, ఇన్ క్రిడిబుల్ ఇండియా, ట్రావెల్ విత్ భరద్వాజ్ అనే హ్యాష్ ట్యాగ్ లను జోడించింది. విహార యాత్రలో వీరు జలపాతం వద్ద ఎంజాయ్ చేసి ఆ తరువాత చేతితో గొడుగు పట్టుకొని వెళ్తున్న ఫొటోలనూ షేర్ చేసింది.
ఈ సందర్భంగా కొందరు ఆమె పిక్స్ పై కామెంట్ చేశారు. కొందరు ‘అద్భుతమైన కుటుంబ జీవితం’ అని రాయగా.. మరికొందరు ‘కుటుంబంతో గడపడం ఉత్తమమైన సమయం’ అని కామెంట్ చేశారు. టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలో బిజీగా ఉన్న అనసూయ ప్రస్తుతం ‘పుష్ప 2 ’లో నటిస్తోంది. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో నటించనుంది.