Wednesday, March 18, 2026

సింగిల్ గ్యాస్ సిలిండ్ ఉన్నవారికి అలర్ట్.. మీ ఇంట్లో వంట గ్యాస్ ఎంతవరకు ఉందో ఈ ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు..

ప్రస్తుతం కాలంలో గ్యాస్ పొయ్యి లేని ఇల్లు లేదు. ఏదో ఒక కంపెనీకి చెందిన సిలిండర్ తో రోజూ వంట చేసుకుంటూ ఉంటాం. వంట గ్యాస్ వద్ద ఎక్కువగా మహిళలే ఉంటారు. అందువల్ల దీని గురించి మహిళలు ఎక్కువగా అవగాహన కలిగి ఉండాలి. వంట గ్యాస్ వాడే టప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుటే అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఇదే సమయంలో గ్యాస్ ఎంత ఉందో? ఎప్పటి వరకు వస్తుందో? ఎప్పుడు అయిపోతుందఓ అన్న విషయం గ్రహించాలి. లేకుంటే అత్యవసర సమయంలో గ్యాస్ అయిపోతే ఇబ్బందులు ఎదువరుతూ ఉంటాయి. ఈ ఇబ్బందుల నుంచి బయటపడడాని చాలా మంది రెండో సిలిండర్ తీసుకున్నారు. కానీ అదనపు గ్యాస్ సిలిండర్ లేని వాళ్లు గ్యాస్ ఎంత వరకు ఉందో? తెలుసుకోవడానికి చిన్న ట్రిక్ పాటిస్తే చాలు.. అదేంటో చూడండి..

వంట గ్యాస్ ఒక్కసారిగా అయిపోతే పక్కింటి వాళ్లనో.. తెలిసిన వాళ్లనో గ్యాస్ సిలిండర్ ను అప్పు అడుగుతూ ఉంటాం. కానీ కొన్ని సమయాల్లో ఇతరుల వద్ద కూడా గ్యాస్ సిలిండర్ లభించే అవకాశం ఉండదు. ఇలాంటి తరుణంలో సింగిల్ సిలిండర్ ఉన్నవాళ్లు ఎప్పటి కప్పుుడు గ్యాస్ ఎంత ఉందో తెలుసుకుంటూ ఉండాలి. సాధారణంగా గ్యాస్ ఏజెన్సీలో అయితే గ్యాస్ ఎంత ఉందో వెయిట్ మిషన్ పై ఉంచడం వల్ల చూపిస్తుంది. కానీ ప్రతీ ఇంట్లో వెయిట్ మెషిన్ ఉండే అవకాశం లేదు. ఇలాంటప్పుడు..

ఒక గుడ్డను తీసుకోండి.. దీనిని నీటిలో బాగా తడపండి. ఆ తరువత ఈ తడి పేగుతో గ్యాస్ సిలిండర్ మొత్తం తుడవండి.. లేదా ఆ తడి గుడ్డ పెద్దదిగా ఉండే గ్యాస్ సిలిండర్ చూట్టూ ఉంచండి. ఇప్పుడు గ్యాస్ ఉన్న చోట తడిగా ఉంటుంది. గ్యాస్ లేని చోట ఆరిపోతుంది. ఇలా గ్యాస్ ఎంత వరకు ఉందో ముందే గ్రహించి జాగ్రత్త పడండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News