Saturday, December 6, 2025

రైతులకు అలర్ట్.. అతి త్వరలో పీఎం కిసాన్ యోజన నగదు.. ఈ పని చేశారా?

రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్ సమ్మాన్ యోజన’పథకంను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పథకం కింద 19 విడతలుగా ఆర్థిక సాయం చేసింది. ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతలుగా రూ.2,000 ఇస్తూ వస్తోంది. ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో 19వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ అయ్యాయి. అయితే ఇప్పుడు 20 విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ డబ్బులు ఎప్పుడు విడుదల అవుతున్నాయంటే?

ఫిబ్రవరిలో 19వ విడత డబ్బులు రిలీజ్ అయినందున.. 20వ విడత మొత్తం జూన్ చివరి వారంలో బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని అనుకున్నారు. కానీఅలా జరగలేదు. దీంతో జూలై మొదటి వారంలో ఈ మొత్తం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు పొందాలంటే E-kycని పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ కైవేసీ పూర్తి చేయకపోవడంతో చాలా మంది ఈ డబ్బులు పొందడం లేదు.

మీసేవ కేంద్రాలతో పాటు మొబైల్ లోనూ ఈ కైవేసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ తో పాటు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయడం ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. వీటి నమోదు విషయంలో ఎలాంటి సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని అంటన్నారు. మరి మీరు రైతులు అయి ఉండి ఇప్పటి వరకు ఈ కైవేసీ పూర్తి చేసుకోకపోతే వెంటనే పూర్తి చేసుకోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News