Artificial intelligence (AI) విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై డిసెంబర్ 29వ తేదీన శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఏఐ అనేది కొందరికి మాత్రమే కాకుండా అందరికీ ఉపయోగపడాలనేదే దీని ఉద్దేశం. అంటే గ్రామాల్లోనూ సైతం ఏఐ టూల్స్ వాడుతూ.. లోకల్ భాషలోకి మార్చుకునే విధంగా కంప్యూటర్, డేటాను తయారు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పోటీ ఏర్పడుతుండడంతో ఏఐ కీలకంగా మారే అవకాశం ఉందని ఈ పత్రంలో పేర్కొన్నారు. ప్రపంచ సంస్థలు ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఏఐ ఉండడంతో ఎవరికి ఉపయోగ ఉండదని.. దేశంలోని నలుమూలలకు వెళ్లడం వల్ల వినియోగదారుల అవసరాలను తీర్చే అవకాశం ఉంటుందని ఇందులో పేర్కొన్నారు.
ఇప్పటికే భారత దేశంలో ఆధార్, UPI వంటి డిజిటల్ వ్యవస్థలు గ్రామాల్లోకి వెళ్లడంతో వాటిని ఉపయోగించి ప్రజలు తమ అవసరాలను సులభతరం చేసుకున్నారు. ఇప్పుడు ఏఐ కూడా గ్రామాల్లోకి వెళ్లడంతో కొన్ని పనులు ఈజీగా మారే అవకాశం ఉందని అంటున్నారు. సామాజిక ఆర్థిక అభివృద్ధికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కంప్యూటింగ్, డేటా ఎంతో సహాయం చేస్తాయని.. అయితే వీటిని గ్రామాల్లోకి తీసుకెళ్లినప్పుడే అవి సాధ్యమవుతుందని తెలిపారు.ఇందులో భాగంగా AI కోసం డేటా సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. భిన్న విషయాల సమాచారం, భాషల డేటా సెట్లు ఏర్పాటు చేయనున్నారు.
గ్రామాల్లో AI వెళితే ఎలాంటి ప్రయోజనాలు?
వ్యవసాయం (Agriculture): పంట డిజీజ్ గుర్తింపు: పొలాల్లో ఫోటోలను చూపించి రోగాల్ని, పురుల్ని ముందుగానే గుర్తించుకోవచ్చు. ఫైసిలిటీ సూచనలు: ఏ విత్తనం, ఎన్ని నీళ్లు కావాలో సూచనలు ఇస్తుంది.
ఆరోగ్యం (Healthcare):AI డాక్టర్ అసిస్టెంట్: చిన్న ఆహార కేంద్రాల్లో ఇ-హెల్త్ సుధారిత సేవలు, రిమోట్ డయగ్నోసిస్.బయోమెడికల్ సూచనలు: సిమ్ప్టమ్స్ ప్రకారం ప్రాథమిక సూచనలు, పరీక్ష ఫలిత విశ్లేషణ.
విద్య (Education):పర్సనలైజ్డ్ లెర్నింగ్: విద్యార్థి స్టైల్ కు అనుగుణంగా నేర్పే AI ట్యూటర్స్.స్థానిక భాషలలో సహాయం: తెలుగు, హిందీ లాంటి భాషల్లో ప్రయోగాలు, ప్రశ్నల సమాధానాలు.
ప్రభుత్వ సేవలు (Governance & Services): గ్రామ పంచాయతీ సేవలు, పింఛన్లు, పత్రాల నిర్వహణలో ఎఐ చాట్బాట్లు, ఆటోమేటిక్ ఫారమ్ ఫిలింగ్.





