- కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు కడారి అయిలయ్య
కరీంనగర్: మధ్య భారత మహారాణి అహల్యబాయ్ హోల్కర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు కడారి అయిలయ్య పిలుపు నిచ్చారు. బుధవారం కరీంనగర్ లో అహల్యబాయ్ హోల్గర్ 230వ వర్ధంతిని కరీంనగర్ జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అహల్యబాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కడారి అయిలయ్య మాట్లాడుతూ అహల్యాబాయి తన 70 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాల పాటు దేశ సేవ చేశారన్నారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు 108 శివ లింగాలను ఏర్పాటు చేయడం, 157 దేవాలయాలను గతంలో విదేశీయుల దాడికి గురైన దేవాలయాలను పునర్ నిర్మించడం, విగ్రహ ప్రతిష్ట చేయడం, రోడ్లు వేయడం, సత్రాల నిర్మాణం, ధర్మశాలలు కట్టించడం వంటివి చేశారన్నారు. అహల్యబాయ్ కుటుంబంలో మగవారు ఎవరు లేని సందర్భంగా.. ఎన్నో త్యాగాలు, ధైర్య సాహసాలతో దేశంలోని ప్రజల బాగోగులను బాధ్యతగా స్వీకరించి రాజ్యాధికారం చేపట్టి.. అతి తక్కువ సమయంలోనే ప్రజలను స్వయంగా కలిసి వారి కష్ట కష్టాలను తెలుసుకున్నారన్నారు.

నర్మదా నదిలో స్నానమాచరించి శివలింగం ఇసుకతో చేసి శివలింగం సాక్షిగా నిర్ణయాలు తీసుకొని ప్రజా పాలన సాగించిన మహారాణి అహల్యబాయ్ హోల్కర్ అన్నారు. చిన్నతనంలోనే నాన్నగారైన మంకోజి షిండే వద్ద ఓనమాలు దిద్ది ఎనిమిది సంవత్సరాల వయస్సులో రాజుగారైన మల్హర్రావు హోల్కర్ పూణేకి వెళ్లే దారిలో షిండే గ్రామంలో శివాలయంలో అన్నదాన కార్యక్రమాలు చేశారన్నారు. 1725 మే 31న అహ్మదాబాద్ జిల్లా చండీ గ్రామంలో సామాన్య దన్గర్ (గొర్రెల కాపరి) కుటుంబంలో జన్మించిన అహల్యాబాయి జీవిత చరిత్రను ప్రస్తుత ప్రభుత్వాలు పాఠ్యాంశంగా చేర్పించి నేటి తరానికి అందించాలని అన్నారు.
అహల్యాబాయ్ జయంతి సందర్భంగా గత మే 31న ఆమె పేరు రూపీ కాయిన్ ముద్రించి ఇండోర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారన్నారు. ఇండోర్ విమానాశ్రయానికి అహల్యబాయి పేరు పెట్టడం గర్వించ దగ్గ విషయం అన్నారు. రాబోయే రోజుల్లో జయంతులు మే 31న, ఆగస్టు 13న వర్ధంతి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా జరుపుకుంటూ వారికి ఘన నివాళులర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ ట్రస్ట్ అధ్యక్షుడు చిగుర్ల శ్రీనివాస్ , కురుమ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మేకల నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఈరల్ల విజయ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎల్కపెల్లి రమేశ్, జిల్లా కోశాదికారి గుంట రవిందర్ , మెుట్టె సతీష్, కర్రె శ్రీనివాస్ , పబ్బల్ల కోటి, ఒల్లెం సంజీవ్, దయ్యాల అశోక్, పబ్బల్ల హనుమంతు, ఎల్కపెల్లి భూమయ్య, తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు.





