వివాదాలు లేకుండా బాలీవుడ్ మూవీ రిలీజ్ అవడం కష్టంగా మారింది నేటి రోజుల్లో. తాజాగా మరో మూవీ వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖార్ హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ముందుగా ఇది అసభ్యకరంగా ఉందని గుజరాత్ హైకోర్టు విడుదలను నిలిపివేసింది. తాజాగా ఈ ఈ సినిమాను విడుదల చేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఈ సినిమాకు ఉన్న వివాదం ఏంటి?
అమీర్ ఖార్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘మహరాజ్’. సిద్ధార్థ్ మల్హొత్ర డైరెక్షన్ వహించిన ఈ మూవీ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చొప్రా నిర్మించారు. వాస్తవానికి ఈ మూవీని జూన్ 14న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని కొన్ని హిందూ సంఘాలు గుజరాత్ కోర్టును ఆశ్రయించారు. దీంతో ‘మహరాజ్’మూవీని ముందుగా నిలిపివేశారు. ఆ తరువాత విడుదల చేయొచ్చని గుజరాత్ కోర్టు తెలపింది.
దీంతో జూన్ 21న ఎలాంటి హడావుడి లేకుండా విడుదల చేశారు. అయితే ఇంతకీ ఈ సినిమాలో ఉన్న వివాదం గురించి పరిశీలిస్తే.. 1862లో మహరాజ్ లిబెల్ కేసు ఆధారంగా ఈ మూవీని తీశారు. స్థానికులు దేవుడిగా కొలిచే జెజె అలియాస్ మహరాజ్ లోని రహస్య కోణాన్ని బయటపెట్టే పనిని సామాజిక వేత్త కర్షన్ దాస్ ప్రారంభిస్తాడు. ఆ తరువాత ఆయన మహరాజ్ గురించి ఎలాంటి నిజాలు బయటపెట్టారనేదే సినిమా స్టోరీ.