Saturday, December 6, 2025

భారతదేశానికి సమీపాన భయంకర దీవి..

భారతదేశానికి దక్షిణాన ఉన్న అండమాన్ దీవుల్లో పోర్టు బ్లేయర్ నగరం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విమాన సౌకర్యం కూడా ఉంది. ఈ నగరంతో ఇతర దేశాలకు కనెక్టివిటీ ఉంటుంది. అయితే పోర్టు బ్లేయర్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఒక దీవి ఉంటుంది. ఆ దీవి పేరు North Sentinel Iceland. ఈ దీవి మొత్తం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల శాటిలైట్ నుంచి దీవి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. అంతేకాదు ఈ దేవి గురించి తెలుసుకోవడానికి ఇప్పటివరకు ఎంతోమంది ప్రయత్నించారు. కానీ ఇక్కడికి వెళ్లినవారు తిరిగి రాలేదు. ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్న ఈ దీవిలో ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఈ దీవి డేంజర్?

North Sentinal Iceland (National Geographic pic)
North Sentinal Iceland (National Geographic pic)

26వేల సంవత్సరాల పూర్వం భారత భూభాగానికి అనేక దీవులు కలిసి ఉండేవి. ఇందులో భాగంగా అండమాన్ దీవులకు దగ్గరగా ఉన్న ఈ North Sentinal Iceland కూడా కలిసి ఉండేది. అయితే ఆ తర్వాత భూమిపై పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా సముద్రమట్టం పెరిగింది. దీంతో North Sentinal Iceland అని దీవి సపరేట్గా మారిపోయింది. అలా 1789లో ఈ ద్వీపాన్ని గుర్తించారు. అయితే అప్పటినుంచి ఈ ద్వీపానికి వెళ్లాలని చాలామంది ప్రయత్నించారు. 1867 వ సంవత్సరంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయంలో ఇక్కడికి బ్రిటిష్ నౌకలు వెళ్లాయి. ఇందులో 107 మంది ఉన్నట్లు అంచనా. అయితే వాళ్ల షిప్ లు రిపేర్ కారణంగా ఈ దీవి దగ్గర ఆగాల్సి వచ్చింది. అప్పుడు వారికి ఈ దీవి గురించి పూర్తిగా తెలియదు. ఇక్కడ ఎవరూ లేరు అనుకోని వారు నివసించాలని అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఉన్న తెగ వాళ్ళు బ్రిటిష్ వారిపై దాడి చేసి చంపేశారు. అయితే ఇందులో కొందరిని బ్రిటిష్ నేవీ వాళ్లు రక్షించారు. అప్పటినుంచి ఈ దీవి భయంకరంగా మారింది. 1881 సంవత్సరంలో ఈ దీవి గురించి తెలుసుకోవాలని దీనికి బ్రిటిష్ ప్రభుత్వం Maurice Vidal Portman ను నియమించింది. అయితే ఈయన ఈ దీవిలోని ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా ఇక్కడున్న ఒక కుటుంబాన్ని కిడ్నాప్ చేసి బయట ప్రపంచానికి తీసుకెళ్లాడు. కానీ బయట వాతావరణానికి తట్టుకోలేక ఆ కుటుంబంలోని భార్యాభర్తలు మరణించారు. అయితే వారి పిల్లలు కూడా బయటి వాతావరణం లో ఉంటే తట్టుకోలేక పోతారని భావించి.. ఆ దీవిలోనే విడిచిపెట్టారు. అప్పటినుంచి ఆ దీవి గురించి పట్టించుకోవడం మానేశారు.

అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రభుత్వం నేషనల్ జియోగ్రఫీ ఆధ్వర్యంలో North Sentinal Iceland గురించి తెలుసుకోవాలని మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆంత్రోపాలజిస్ట్ త్రిలోక్ నాథ్ ఈ బాధ్యతను చేపట్టాడు. అయితే ఈ దీవి గురించి తెలుసుకోవాలంటే అక్కడి ప్రజలను మచ్చుగా చేసుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా ఈ పరిశోధనలతో పాటు డాక్యుమెంటరీ కూడా తీయాలని అనుకున్నారు. ఒకసారి త్రిలోక్ నాథ్ సినిమా బృందంతో కలిసి ఈ దీవి వద్దకు వెళ్ళింది. అయితే మరోసారి అక్కడ ఉన్న ప్రజలు బాణాలతో దాడి చేశారు. ఇందులో సినిమా డైరెక్టర్ కాలికి గాయం అయింది. అప్పటినుంచి మరోసారి ఇక్కడికి వెళ్లడానికి ఎవరు ప్రయత్నించలేదు. అయితే త్రిలోక్ నాథ్ మాత్రం ఇక్కడ ఈ ప్రజలకు బహుమతులు ఇవ్వడం ప్రారంభించాడు. అలా కొన్నాళ్లపాటు వారికి దగ్గరయ్యాడు.

అయితే ఇదే సమయంలో ఇక్కడికి 30 మందితో కూడిన ఒక పడవ వచ్చింది. ఈ పడవని చూడగానే మరోసారి ఇక్కడున్న ప్రజలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే పడవలో ఉన్నవారు అప్రమత్తమై వారి కంపెనీకి సమాచారం తెలియజేయగా హెలికాప్టర్ల ద్వారా వచ్చి ఇందులోని వారిని రక్షించారు. కానీ పడవను అక్కడే వదిలి వెళ్లారు. ఇప్పటికీ ఆ పడవ అక్కడే ఉండడం విశేషం. అయితే త్రిలోక్నాథ్ పండిత్ రిటైర్ అయిన తర్వాత ఈ దీవిలోకి వెళ్లడానికి నిషేధం ప్రకటించింది. అంతేకాకుండా ఈ దీవి సంరక్షణ బాధ్యత భారత ప్రభుత్వం చూస్తుంది. దేవి చుట్టూ తిరుగుతుంది.

ఇక్కడ ఉన్న ప్రజలు తమకు ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తుంటారు. అలాగే ఇక్కడికి ఎవరైనా వస్తే వారిపై దాడి చేయడానికి వెనుకాడరు. వాస్తవానికి వారు ఇప్పటికీ ఆటవిక జీవనంలోనే కొనసాగుతుండడం కొన్ని ఫోటోలు ద్వారా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ దీవి వద్దకు వెళ్లడానికి పూర్తిగా నిషేధం ప్రకటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News