మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం లభించింది. ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ (IFFM) 15 వ ఎడిషన్ త్వరలో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ కు ఆహ్వానం దక్కింది. భారతీయ చలన చిత్ర రంగంలో రామ్ చరణ్ చేసిన సేవలకు ఆయన ఈ వేదికగా అవార్డు అందుకోనున్నారు. రామ్ చరణ్ కు ఇక్కడి ప్రతినిధులు ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’ అవార్డును అందజేయనున్నారు. IFFM ఏర్పడి 15 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ఆగస్టు 15 నుంచి 25 వరకు వేడుకలు నిర్వహించనున్నారు.
రామ్ చరణ్ కు వచ్చిన ఈ ఆహ్వానంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో తాను ఓ భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇది నాకు దక్కిన గౌరవం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, సినీ జనాలతో కనెక్ట్ కావడం సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఈ అవార్డు ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మకం. ఇది రామ్ చరణ్ కు ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే గ్లోబల్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పేరు రావడంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా పిలుస్తున్నారు.