న్యూఇయర్ రాగానే చాలా మందిలో ఎక్కడా లేని సంతోషం. స్నేహితులతో పార్టీలు చేసుకోవడం.. కేక్ కట్ చేయడం.. విందులో పాల్గొనడం వంటివి ఉంటాయి. ఇదే సమయంలో డీజేలు పెట్టి డ్యాన్సులు చేయడం జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవడానికి సందడి చేస్తుంటారు. ఈ పరిస్థితి కేవలం భారత్ లోనే కాకుండా ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు ఉంటుంది. కానీ కొత్త సంవత్సరం అనగానే ఆ దేశంలో ఇలాంటివి కనపించవు. ఈరోజు కార్యాలయాలకు సెలవు. ఎలాంటి ప్రయాణాలు ఉండవు. ఇంట్లో నుంచి ప్రజలు బయటకు రారు. మొత్తంగా ఇదొక లాక్ డౌన్ (Lockdown)లాగా అనిపిస్తుంది. మరి ఇలా ఎందుకు చేస్తారు? ఇలా చేయడానికి ఏమంటారు?
కొత్త సంవత్సరం అనేది ఆంగ్లేయులు సృష్టించింది.. దీనిని హిందువులు జరుపుకోవద్దని కొందరు వాదిస్తుంటారు. అయినా కూడా చాలా మంది ఈ సంస్కృతినే ఫాలో అవుతారు. కానీ ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో మాత్రం హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్లు జరుగుతుంది. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో మాత్రం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 1 ఉదయం వరకు ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రారు. తమ కార్యాలయాలు పూర్తిగా మూసి వేయబడతాయి. ఎలాంటి రవాణా ఉండదు. విమానాలు ఎక్కడికి అక్కడ ఆగిపోతాయి. ఒక విధంగా చూస్తే లాక్ డౌన్ లాగా మారిపోతుంది. మొత్తం నిశ్శబ్దంగా మారడంతో పక్షుల శబ్దాలు కూడా వినిపిస్తాయి. ఇలా న్యూ ఇయర్ రోజున ఉండడాన్ని నేర్పి (Nyepi) అని అంటారు. అంటే 24 గంటల పాటు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఉంటూ ఎలాంటి మొబైల్స్ గాని.. కరెంటు కు సంబంధించిన వస్తువులు కానీ ఉపయోగించకుండా గడపడం.ౌ

ఇలా చేయడం వల్ల వారు ఎంతో ప్రశాంతతను పొందుతారు. లక్షల లీటర్ల డీజిల్ సేవ్ అవుతుంది. అత్యధికంగా పవర్ కూడా మిగులుతుంది. వాతావరణం లో ఎలాంటి కాలుష్యం విలువడకపోవడంతో స్వచ్ఛంగా మారుతుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అన్ని మతాలవారు దీనిని పాటిస్తారు. ఇలా పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతామని వారి నమ్మకం. అయితే డిసెంబర్ 31 వ రోజు కంటే ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 30 రాత్రి ఇక్కడ ఓగో కవాతు జరుగుతుంది. ఇందులో భాగంగా కళాకారులు భారీ రాక్షసుల బొమ్మలు ధరించి నడుస్తారు. అగ్నిజ్వాలలో వెలిగిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
అయితే నూతన సంవత్సరం రోజున ఇలా మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే ఏడాదంతా తాము చేసిన తప్పులను ఆత్మ పరిశీలన తీసుకుంటారు. వచ్చే సంవత్సరం నుంచి అయినా ఆ తప్పులు చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో నిశ్శబ్దంగా ఉండగలుగుతారు.





